ఈ టిఆర్ఎస్ కార్పొరేటర్ మేడ్చల్ కలెక్టర్ నే తిట్టిండు

First Published Sep 17, 2017, 10:39 PM IST
Highlights
  • కలెక్టర్ పై దురుసుగా ప్రవర్తించిన కార్పొరేటర్ 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన మేడ్చల్ కలెక్టర్
  • కీసర పోలీసు స్టేషన్ లో కేసు నమోదు
  • మొన్నటికి మొన్న కార్పొరేట్ కొడుకు పైనా కేసులు

తెలంగాణలో డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న మేడ్చల్ కలెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డిపై ఒక అధికార టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ధూషించిన సంఘటన ఇది. కలెక్టర్ పై చిందులేసిండు. ఆయన విధులకు ఆటంకం కలిగించిండు. దీంతో కలెక్టర్ సదరు కార్పొరేటర్ పై పోలీసులకు ఫఇర్యాదు చేశారు. దీంతో చిందులేసిన కార్పొరేటర్ పై 353 సెక్షన్ కింద కేసు నమోదైంది.

వివరాలిలా ఉన్నాయి.

మేడ్చల్ కలెక్టర్ ను కలిసేందుకు టిఆర్ఎస్ కు చెందిన కూకట్ పల్లి ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ పై చిందులేసిండు. నేను కార్పరేటర్  ను నన్నే వెయిట్ చేపిస్తావా అంటూ ఏకగంగా కలెక్టర్ పై దురుసుగా ప్రవర్తించిండు. దీంతో కలెక్టర్ కీసర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కీసర పోలీసులు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పై కేసు నమోదు చేశారు.

కార్పొరేటర్ కథ ఇట్లుంటే... ఇక ఆయన కొడుకు కథ కూడా ఉంది. ఇటీవల అకారణంగా ఓ వ్యక్తి పై దాడి చేసి దురుసుగా ప్రవర్తించిన సంఘటనలో KPHB ps లో కేసు నమోదు అయింది సదరు ఈ కార్పొరేటర్ కొడుకు మీదనే.

ఈ కార్పొరేటర్ స్థానిక అధికారులపైనా దౌర్జన్యాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తండ్రీ కొడుకులు గల్లీ ప్రజలపై దాదాగిరి చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరి వ్యవహారం మున్సిపల్ మంత్రి కేటిఆర్ దృష్టికి కూడా చేరిందని తెలిసింది. గతములో ఏకంగా కూకట్‌పల్లి మండలం లోని ఓ రెవిన్యూ అధికారి ఇంటిపైకి వెళ్లి దాడి చేసిన ఘటనలో పోలీసు స్టేషన్లో వీరి మీద కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఈ వివాదాస్పద కార్పోరేటర్ మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారోనని ఆయన అనుచరుల్లో గుబులు పట్టుకుంది.

click me!