మహిళలకు శుభవార్త: కరోనా ఉన్నా.. యథావిధిగా బతుకమ్మ చీరల పంపిణీ

By Siva KodatiFirst Published Oct 8, 2020, 3:27 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నారు.

కరోనా ఉన్నప్పటికీ ఈ పంపిణీకి బ్రేక్‌ పడలేదు. తాజాగా..రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన కోటి మంది ఆడపడుచులకు రేపటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.

ఈ ప్రక్రియ 11వ తేదీ వరకు కొనసాగనుంది. 287 డిజైన్లలో మగ్గాలపై చేసిన చీరల 33 జిల్లాలకు చేరాయి. చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేశారు.

కరోనా నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులే ఇంటింటికీ వెళ్లి చీరలను అందజేయనున్నారు. అప్పుడు తీసుకోలేని వారికి  12 నుంచి 15 వ తేదీ లోగా రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేస్తారు. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లో మరమగ్గాలపై చీరలను తయారు చేయించింది తెలంగాణ ప్రభుత్వం.

మరమగ్గ నేతన్నలకు ఉపాది కల్పించటం..అదే సమయంలో అడపడుచులకు చిరు కానుక అందించటమే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది మొత్తం 98.50 లక్షల చీరలు అవసరమవుతాయని అంచనా వేసి అన్ని జిల్లాలకు చేరవేశారు అధికారులు.

click me!