
తెలంగాణ బతుకమ్మ వచ్చే గణతంత్ర దినోత్సవాన ఢిల్లీ రాజ్ పథ్ వద్ద నిర్వహించే శకట ప్రదర్శనలో కనువిందు చేయనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర నుంచి సమాచారం అందింది. బతుకమ్మకు సంబంధించి 3డీ డిజైన్ ను పంపడంతో పాటు, 65 సెకన్ల నిడివిగల థీమ్ సాంగ్ ను పంపాలని రక్షన శాఖ ఉత్సవ విభాగ కమిటీ ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈవాళ లేఖ రాసింది. కాగా, గతంలో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మను తమ రాష్ట్రం తరఫున శకటంగా ప్రదర్శించేందుకు అనుమతి కోరింది. దీనిపై పలుమార్లు చర్చించిన అధికారులు ఎట్టకేలకు బతుకమ్మ శకటానికి ఓకే చెప్పారు.