
బిసి కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. కమిషన్ ఛైర్మన్‌గా బిఎస్ రాములు, సభ్యులుగా జూలూరి గౌరి శంకర్, అంజనేయులుగౌడ్, వకుళాభరణం కృష్ణమోమన్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న,ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఛైర్మన్ రాములుకు, ముగ్గురు సభ్యులకు అభినందనలు తెలిపారు. బిఎస్ రాములు తెలంగాణలో బాగా పేరున్న రచయిత, సామాజిక తత్వవేత్త. తెలంగాణ ప్రజా ఉద్యమాలతో బలమైన సంబంధాలున్న వ్యక్తి.