ప్రతి బ్యాంకు బాదుతోంది

Published : Mar 06, 2017, 02:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
ప్రతి బ్యాంకు బాదుతోంది

సారాంశం

సర్వీసు చార్జీల పేరుతో అన్ని బ్యాంకులు కస్టమర్ల జేబులు గుల్ల చేసే కొత్త నిబంధనలను ఏప్రిల్ నుంచి ముందుకుతెస్తోంది.

మా బ్యాంకులో డిపాజిట్ చేయండంటూ మన చుట్టూ తిరిగిన బ్యాంకులే ఇప్పుడు రూటు మారస్తున్నాయి. మన డబ్బులు మనం డ్రా చేసుకోవాలన్నా ఇకపై జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. సర్వీస్ టాక్స్ అంటూ కొత్త బాదుడుకు ఎస్ బీఐ తెర తీస్తే ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులు కూడా అదే బాట పడుతున్నాయి.

ఆన్ లైన్ లావా దేవీలను ప్రొత్సహించాలనే కుంటిసాకుకుతో కస్టమర్ల నడ్డి విరగ్గొట్టేందుకు అన్ని బ్యాంకులు చేతులు కలిపాయి.

 

ఏ బ్యాంకు ఏ స్థాయిలో సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నాయో ఒక సారి చూడండి.

 

ఎస్ బీఐ
 

మూడు సార్లకు మించి డిపాజిట్ చేస్తే సర్వీసు చార్జీలు బాదేస్తారు. ప్ర‌తి ట్రాన్సాక్షన్ పై  రూ.50 స‌ర్వీస్ ఛార్జ్ వ‌సూలు చేస్తారు. క‌రెంట్ అకౌంట్ అయితే రూ.10వేల వ‌ర‌కు స‌ర్వీస్ ఛార్జీలుంటాయి. అకౌంట్ల‌లో క‌నీస బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి లేదంటే ఫైన్ కట్టాల్సిందే. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఖాతాదారుల‌కు ఫైన్ కాస్త త‌క్కువ‌గా ఉంటుంది.

మెట్రో పాలిట‌న్ ప్రాంతాల్లో మినిమ‌మ్ బ్యాలెన్స్ రూ.5000 ఉండాలి. అయితే రూ.5వేల‌కు 75 శాతానికి త‌క్కువ‌గా బ్యాలెన్స్ ఉన్న‌ట్ల‌యితే రూ.100 జరిమానా విధిస్తారు. అదే 50 శాతానికి మించి త‌క్కువ‌గా ఉంటే రూ.50 వ‌ర‌కు పెనాల్టీ ఉంటుంది.

ఇక ఏటీఎంల విష‌యానికొస్తే ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి ఉపసంహరణ మూడు సార్లు దాటితే రూ.20 ఛార్జీ విధిస్తారు.ఎస్‌బీఐ ఏటీఎంలలో నగదు ఉపసంహరణ ఐదు సార్లు దాటితో రూ.10 చొప్పును ఛార్జీ ఉంటుంది.

మీ అకౌంట్‌లో రూ.25వేలకు మించి ఉంటే ఎస్బీఐ ఏటీఎం నుంచి ఎన్నిసార్లైనా స‌రే ఎలాంటి రుసుం లేకుండా ఎస్బీఐ డెబిట్ కార్డుతో డ‌బ్బు డ్రా చేసుకోవచ్చు. ఒక వేళ మీ అకౌంట్‌లో రూ.1 ల‌క్ష అంత‌కుమించి ఉంటే ఇత‌ర బ్యాంకు ఏటీఎంల‌నుంచి కూడా ఎస్బీఐ డెబిట్ కార్డుతో  ఎన్నిసార్లు అయినా డ‌బ్బును డ్రా చేసుకోవ‌చ్చు

ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌లపై మూడునెలకు రూ.15 ఛార్జీలు వ‌సూలు చేస్తారు.రూ.1000 వరకు యూపీఐ, యూఎస్‌ఎస్‌డీ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు.


యాక్సిస్ బ్యాంక్

ఈ బ్యాంకు ఖాతాదారులు నెల‌కు 5 లావాదేవీలు ఎలాంటి రుసుము లేకుండా జ‌ర‌పొచ్చు. ఆపైన ట్రాన్సాక్ష‌న్స్ జ‌రిపితే ఒక్క లావాదేవీకి రూ.95 వ‌సూలు చేస్తారు

 

నాన్ హోమ్ బ్రాంచ్ ట్రాన్సాక్ష‌న్స్ ఐదు సార్లు జ‌రిపితే ఎలాంటి ఛార్జ‌లు ఉండ‌వు అయితే క‌నీస లావాదేవీలు రోజుకు రూ.50వేల‌కు తక్కువ‌గా ఉండ‌కూడ‌దు. ఆరో ట్రాన్సాక్ష‌న్ నుంచి ప్ర‌తి రూ.1000కి రూ.2.50 ఛార్జ్ చేస్తారు లేదా రూ.95 ఛార్జ్ చేస్తారు. రెండిట్లో ఏది ఎక్కువ‌గా ఉంటే దాన్ని బట్టి ఛార్జీలు విధిస్తారు.

HDFC బ్యాంకు

 

ఖాతాదారులు  నెల‌కు  డిపాజిట్స్ కానీ విత్‌డ్రాయ‌ల్స్ కానీ నాలుగు సార్లు మాత్ర‌మే చేసుకోవ‌చ్చు. ఆపైన ట్రాన్సాక్ష‌న్స్‌కు రూ.150 వ‌సూలు చేస్తారు. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్‌తో పాటు శాల‌రీ అకౌంట్ల‌కు కూడా వ‌ర్తిస్తాయి.

హోమ్ బ్రాంచ్ లో అయితే  రోజుకు రూ. 2 ల‌క్ష‌లు డిపాజిట్ లేదా విత్‌డ్రాయ‌ల్‌కు ఎలాంటి ఛార్జీలు ఉండ‌వు. అయితే రూ.2 ల‌క్ష‌లు ట్రాన్సాక్ష‌న్ ఒకేసారి నిర్వ‌హించాల్సి ఉంటుంది. ఆపైన ప్ర‌తి రూ.1000కి రూ.5 వ‌సూలు చేస్తారు లేదా రూ.150 వ‌సూలు చేస్తారు.
నాన్‌-హోమ్ బ్రాంచ్‌ల‌లో రూ.25వేల‌కు మించి డిపాజిట్ చేసినా విత్‌డ్రాచేసిన ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 వ‌సూలు చేస్తారు

ఐసీఐసీఐ బ్యాంకు..

 

హోం బ్యాంకులో నెల‌లో జ‌రిపే మొద‌టి నాలుగు లావాదేవీల‌కు ఎలాంటి ఛార్జీలు వ‌సూలు చేయ‌రు. ఆపై ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు. థ‌ర్డ్ పార్టీ ద్వారా జ‌రిపే డిపాజిట్స్ రోజుకు రూ.50వేలు

నాన్ హోమ్ బ్రాంచ్‌ల‌లో నెల‌లో తొలిసారిగా జ‌రిపే క్యాష్ విత్‌డ్రాయ‌ల్స్‌పై ఎలాంటి రుసుము ఉండ‌దు. ఆ త‌ర్వాత జ‌రిపే లావాదేవీల‌పై ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు.

క్యాష్ డిపాజిట్ మెషీన్ల‌లో న‌గ‌దు డిపాజిట్ చేస్తే మొద‌టిసారి ఎలాంటి రుసుము విధించ‌రు. ఆ తర్వాత డిపాజిట్ చేస్తే ప్ర‌తి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీలు విధిస్తారు.

 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా