పుడింగ్ మింక్ పబ్: నిన్నపేరు మాయం,నేటి జాబితాలో నిహరిక పేరు

Published : Apr 04, 2022, 10:09 PM ISTUpdated : Apr 04, 2022, 10:15 PM IST
పుడింగ్ మింక్ పబ్: నిన్నపేరు మాయం,నేటి జాబితాలో నిహరిక పేరు

సారాంశం

హైద్రాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ మింక్ పబ్ లో నిన్న లిస్టులో చేర్చని రెండు పేర్లను ఇవాళ చేర్చారు. నిన్నటి లిస్టులో నిహరిక పేరు లేదు. ఇవాళ నిహరిక పేరును చేర్చారు. అంతేకాదు మాజీ పోలీస్ ఉన్నతాధికారి కూతురు పేరును కూడా చేర్చారు. 

హైదరాబాద్: Pudding Mink పబ్ లో దొరికిన లిస్టులో పోలీసులు మార్పులు చేర్పులు చేశారు. ఆదివారం నాడు విడుదల చేసిన జాబితాలో  లేని పేర్లను ఇవాళ చేర్చారు. నిన్న విడుదల చేసిన జాబితా సినీ నటుడు Nagababu కూతురు Niharika  పేరు లేదు. కానీ ఇవాళ విడుదల చేసిన జాబితాలో నిహరిక పేరును 37 సీరియల్ నెంబర్ లో చేర్చారు. 38వ సీరియల్ నెంబర్ లో మాజీ పోలీస్ ఉన్నతాధికారి కూతురు పేరును కూడా చేర్చారు.

ఆదివాంనాడు  మీడియా ముందే నిహారిక బయటకు వెళ్లిపోయింది. అయితే పోలీసులు విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. ఆదివారం నాడు తెల్లవారుజామున పోలీసులు దాడి చేసిన సమయంలో పబ్ లో 145 మంది ఉన్నారని పోలీసులు ప్రకటించారు.  ఈ 145 మందిలో 20 మంది పబ్ స్టాఫ్ కూడా ఉన్నారని పోలీసులు వివరించారు.Banjara Hills పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే ఉన్న ఈ పబ్ లో నిబంధనలనుు ఉల్లంఘిస్తున్న విషయం తెలిసి కూడా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వెల్లువెత్తాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ పబ్ పై నిఘాను ఉంచారు. కచ్చితమైన సమాచారం  రావడంతో నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ నాగేశ్వరరావు నేతృత్వంలో   పోలీసులు ఈ పబ్ పై దాడి చేశారు. 

ఈ పబ్ లో డ్రగ్స్ కూడా దొరకడం ప్రస్తుతం కలకం రేపుతుంది. డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.ఈ పబ్ లో సీసీటీవీ పుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఈ పబ్ వ్యవహరం రాజకీయ రంగు పులుముకుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్