కేసీఆర్‌కు ఇదే చివరి అసెంబ్లీ.. నాగోబా దయతో రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి: బండి సంజయ్

By Sumanth KanukulaFirst Published Jan 22, 2023, 4:36 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే చివరి అసెంబ్లీ అని టీ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్ విమర్శించారు. బడ్జెట్‌లో ఇచ్చిన హామీలన్నింటికీ  నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇదే చివరి అసెంబ్లీ అని టీ బీజేపీ అధ్యక్షుడు బండి  సంజయ్ విమర్శించారు. బడ్జెట్‌లో ఇచ్చిన హామీలన్నింటికీ  నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌లో ఆదివాసీల పండుగ నాగోబా జాతర‌లో కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. గిరిజినలు అరాధ్యదైవమైన నాగోబాలను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నాగోబా దయతో రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని అన్నారు. అతిపెద్ద నాగోబా జాతరను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. గిరిజనులంటే కేసీఆర్‌కు చులకన అని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపించారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు.

మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప.. పేద ప్రజలను ఆదుకోవాలన్న సోయి కేసీఆర్ లేదని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. టీఆర్ఎస్ దివాలా  తీసిన కంపెనీ అని.. అందుగా బీఆర్ఎస్‌గా బోర్డు మార్చారని విమర్శించారు. మొన్నటి సభలో కనీసం జై తెలంగాణ అని కూడా కేసీఆర్ అనలేదని అన్నారు. 

click me!