సెంటిమెంట్స్ తో ఆడుకోవద్దు... తేడావస్తే నేనే రంగంలోకి..: వినాయక నిమజ్జనంపై బండి సంజయ్ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 26, 2023, 2:19 PM IST
Highlights

కరీంనగర్ పట్టనంలో వినాయక నిమజ్జనాల కోసం జరుగుతున్న ఏర్పాట్లపై బిజెపి ఎంపీ బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. 

కరీంనగర్ : హిందూ సమాజం ఎంతో భక్తిశ్రద్దలతో వైభవంగా జరుపుకునే వినాయక నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు విధించడం దారుణమని బిజెపి ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజల్లో ఎమోషన్స్ బయటకు వస్తాయని... ఆ తర్వాత ఏం జరిగినా మీరే బాధ్యత వహించాల్సి వుంటుందని హెచ్చరించారు. సెంటిమెంట్స్ కాదని మనోభావాలు దెబ్బతిస్తే దాని తగ్గట్లుగానే రెస్పాండ్ అవుతామని సంజయ్ అన్నారు. 

కరీంనగర్ పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించిన బండి సంజయ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో పట్టణంలోని టవర్ సర్కిల్ వద్దకు చేరుకున్న సంజయ్ అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసారు. నిమజ్జన ఏర్పాట్లు, భారీగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని... తీరు మార్చుకోకుంటే ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

వీడియో

పోలీసులు, అధికారులు గణేష్ మండపాలవద్దకు వెళ్లి నిమజ్జనం రోజు టవర్ సర్కిల్ వద్దకు రావద్దని బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సంజయ్ తెలిపారు. విగ్రహాలను నేరుగా నిమజ్జనానికి తీసుకెళ్లాలని... లేదంటే ఇబ్బంది పడతారని బెదిరించడం దారుణమన్నారు. వాళ్ళ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని...పట్టణంలోని ప్రతి గణనాథుడి విగ్రహం టవర్ సర్కిల్ వద్దకు రావాలని సూచించారు. 

Read More  పీఓపీ గ‌ణేష్ విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు.. హైద‌రాబాద్ లో భ‌క్తుల ఆందోళ‌న‌లు

అసలు టవర్ సర్కిల్ వద్దకు వినాయక విగ్రహాలను తీసుకురావద్దని బెదిరించడానికి మీరెవరు? అంటూ సంజయ్ మండిపడ్డారు. అందరూ టవర్ సర్కిల్ వద్దకే వస్తారు... ఏం చేస్తారో నేనూ చూస్తా అని అన్నారు. మళ్లీ బెదిరిస్తే ఊరుకోబోనని... టవర్ సర్కిల్ వద్దకు తానే స్వయంగా వచ్చి కూర్చుంటానని హెచ్చరించారు. బెదిరింపులకు భయపడి పండగలు జరుపుకోలేని స్థితిలో హిందూసమాజం లేదని బండి సంజయ్ అన్నారు. 

భక్తియుత, ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై వుందని సంజయ్ అన్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అలాకాదని ఇలాగే ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళితే సహించబోమన్నారు. మేం ఏం చేసినా పైవాళ్లు కాపాడతారని అనుకుంటున్నారేమో...  ఎవరూ కాపాడలేరని గుర్తుంచుకోవాలన్నారు. వెంటనే కరీంనగర్ ప్రజలు నిమజ్జన ఉత్సవాలు జరుపుకునే ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ అధికారులకు సూచించారు. 

click me!