బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు జరిమానా విధించిన హైకోర్టు.. కారణమిదే..

Published : Sep 26, 2023, 01:07 PM IST
 బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీతకు జరిమానా విధించిన హైకోర్టు.. కారణమిదే..

సారాంశం

బీఆర్ఎస్ నాయకురాలు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది.

బీఆర్ఎస్ నాయకురాలు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తెలంగాణ హైకోర్టు జరిమానా విధించింది. ఆమెకు రూ. 10 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారిచేసింది. వివరాలు.. గొంగిడి సునీత 2018 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు చూపకుండా, తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. 

అయితే ఈ పిటిషన్‌పై సునీత ఇప్పటివరకు కౌంటర్ దాఖలు  చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే సునీతకు రూ. 10 వేల జరిమానా విధించింది. అక్టోబర్ 3వ తేదీలోగా కౌంటర్ దాఖలు  చేయాలని  ఆదేశించింది. అనంతరం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ