టెన్త్ క్లాస్ పేపర్ లీక్ : వరంగల్ సీపీపై బండి సంజయ్ పరువు నష్టం దావా

By narsimha lode  |  First Published Apr 10, 2023, 3:37 PM IST


వరంగల్ సీపీ  రంగనాథ్ పై  బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  పరువు నష్టం దావా వేయనున్నారు. టెన్త్ క్లాస్  హిందీ  పేపర్  లీక్  కుట్ర కేసులో  తనపై బుదరచల్లేలా  వ్యవహరించారనిబ రగనాథ్ పై  బండి సంజయ్   పరువు నష్టం దావాల  వేసే అవకాశం ఉంది. 
 


హైదరాబాద్:  టెన్త్ క్లాస్  హిందీ  పేపర్ లీక్  కుట్ర కేసులో  తనను  అప్రదిష్టపాలు  చేసేలా  వ్యవహరించారని  ఆరోపిస్తూ  వరంగల్  సీపీ   రంగనాథ్ పై  బండి సంజయ్  పరువు నష్టం దావా వేయనున్నారు. ఈ మేరకు  వరంగల్ సీపీకి  బండి సంజయ్  లీగల్ నోటీసు  పంపనున్నారని  సమాచారం. అంతేకాదు  టెన్త్ క్లాస్  పేపర్ లీక్ కుట్ర కేసులో  తనను  పోలీసులు అరెస్ట్  చేసిన అంశంలో  పోలీసులు వ్యవహరించిన తీరుపై  పార్లమెంట్  ప్రివిలేజ్ కమిటీకి  ఫిర్యాదు  చేయాలని  బండి సంజయ్ భావిస్తున్నారు.వరంగల్ సీపీ రంగనాథ్ పై  వచ్చిన ఆరోపణలపై   బీజేపీ నేతలు  ఆరా తీస్తున్నారు.  జైలు నుండి బెయిల్ పై  విడుదలైన తర్వాత  వరంగల్ సీపీ  రంగనాథ్ పై  బండి సంజయ్   విమర్శలు  చేసిన  విషయం తెలిసిందే. 

వరంగల్ సీపీపై  ఉన్న  ఆరోపణలను కూడా వెలికి తీయాలని బీజేపీ నేతలు  యోచిస్తున్నారు.  టెన్త్ క్లాస్  పేపర్ లీక్ కేసులో  బండి సంజయ్  కుట్ర  చేశారని వరంతల్ సీపీ  రంగనాథ్ ప్రకటించారు.  ఈ కేసులో  ఏ1 నిందితుడు బండి సంజయ్ అని  రంగనాథ్ ప్రకటించారు.  బండి సంజయ్ డైరెక్షన్ లోనే  ఈ వ్యవహరం జరిగిందని  వరంగల్ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే  

Latest Videos

undefined

 ఈ నెల  4వ తేదీన  టెన్త్ క్లాస్ హీందీ  పేపర్ వాట్సాప్ లో  చక్కర్లు  కొట్టింది.  ప్రశాంత్  అనే  వ్యక్తి  పలువురికి  వాట్సాప్ ద్వారా  టెన్త్ క్లాస్ క్వశ్చన్  పేపర్ ను  పంపినట్టుగా  పోలీసులు  ప్రకటించారు. బండి  సంజయ్ , ఈటల రాజేందర్ సమా  పలువురికి ప్రశాంత్ నుండి  వాట్సాప్ లో  టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం   చేరిందని  వరంగల్ సీపీ  రంగనాథ్ ప్రకటించారు. 

 

click me!