నా ఫోన్ పోయింది, విచారణకు పిలవద్దు: కమలాపూర్ పోలీసులకు బండి లేఖ

By narsimha lodeFirst Published Apr 10, 2023, 3:18 PM IST
Highlights

తన  వద్ద ఫోన్  లేదని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  కమలాపూర్ పోలీసులకు  లేఖ రాశారు.  కమలాపూర్ పోలీసులు ఇచ్చిన నోటీసులకు  బండి  సంజయ్ ఇవాళ  లీగల్ సెల్ ద్వారా  సమాధానం పంపారు. 


హైదరాబాద్: కమలాపూర్ పోలీసులకు  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి  సంజయ్  సోమవారంనాడు  లేఖ రాశారు.  బీజేపీ లీగల్   టీమ్  ద్వారా ఈ లేఖను  బండి సంజయ్  కమలాపూర్  పోలీసులకు పంపారు. ఇవాళ  ఫోన్ తో పాటు  విచారణకు  రావాలని  బండి సంజయ్ కు  కమలాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు  ఇవాళ  బండి  సంజయ్  తన లీగల్ టీమ్ ద్వారా  లేఖ  పంపారు.  తన   ఫోన్ పోయిందని ఇదివరకే  ఫిర్యాదు చేసినట్టుగా  ఆ లేఖలో  బండి సంజయ్  గుర్తు  చేశారు.    తన  ఫోన్  దొరికే  వరకు  తనను  విచారణకు  పిలవద్దని  ఆయన  ఆ లేఖలో కోరారు. 

టెన్త్  క్లాస్  హిందీ  పేపర్  ప్రశ్నాపత్రం  లీక్  కేసుకు  సబంధించి  బండి సంజయ్ ను ఈ నెల  4వ తేదీ  రాత్రి  పోలీసులు అరెస్ట్  చేశారు. ఎస్ఎస్‌సీ  టెన్త్ క్లాస్  హిందీ  పేపర్ ను  ప్రశాంత్  బండి సంజయ్ కు వాట్సాప్ చేశారని వరంగల్ సీపీ  రంగనాథ్ ప్రకటించారు.  అయితే  బండి సంజయ్  ఫోన్  డేటాను రికవరీ చేసేందుకు  ఫోన్  కోసం ప్రయత్నిస్తున్నామని  పోలీసులు  ప్రకటించారు. అయితే  బండి  సంజయ్  తన వద్ద  ఫోన్  లేదని  చెబుతున్నారని  వరంగల్  సీపీ  రంగనాథ్  ప్రకటించిన విషయం తెలిసిందే .  ఈ నెల  3వ  తేదీన  ప్రశాంత్ ,బండి సంజయ్  చాటింగ్   చేశారని కూడా  పోలీసులు  ప్రకటించారు,. అయితే ఈ విషయమై  బండి సంజయ్  కు  రెండు  రోజుల క్రితం  కమలాపూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.  ఈ  నోటీసులపై  బండి  సంజయ్  సోమవారంనాడు  స్పందించారు.  బీజేపీ లీగల్ టీమ్ ద్వారా కమలాపూర్   పోలీసులకు  బండి సంజయ్ సమాధానం పంపారు.    .మీ దగ్గర ఉన్న టెక్నాలజీ   ఆధారంగా  తన ఫోన్ డేటాను  రికవరీ  చేయాలని బండి సంజయ్  ఆ లేఖలో  కోరారు.

also read:ప్రశాంత్ నాకు టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం పంపలేదు: ముగిసిన ఈటల రాజేందర్ విచారణ

ఇదిలా ఉంటే  తన  ఫోన్  పోయిందని  బీజేపీ తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.  ఈ నెల  4వ తేదీ  అర్ధరాత్రి  తనను  పోలీసులు  అరెస్ట్  చేసే సమయంలో  జరిగిన తోపులాటలో తన ఫోన్  పోయిందని  బండి సంజయ్ పోలీసులకు ఇచ్చిన  ఫిర్యాదులో  పేర్కొన్నారు. 
 

click me!