కారణమిదీ: బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

By narsimha lodeFirst Published Aug 2, 2021, 11:12 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  పాదయాత్ర వాయిదా పడింది. పార్లమెంట్ సమావేశాలతో ఇతరత్రా కారణాలతో యాత్ర వాయిదా పడిందని పార్టీవర్గాలు చెప్పాయి. ఆగష్టు 24 నుండి యాత్రను ప్రారంభిస్తామని సంజయ్ తెలిపారు. 

హైదరాబాద్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 9వ తేదీ నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజునే యాత్రను ప్రారంభిస్తానని బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పాదయాత్రను ఆగష్టు 24వ తేదీ నుండి ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా బండి సంజయ్ ప్రకటించారు.విడతల వారీగా పాదయాత్ర చేయనున్నట్టుగా బండి సంజయ్ ప్రకటించారు. తొలి విడత పాదయాత్రను ఈ నెల 9 వ తేదీ నుండి ప్రారంభించాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాల కారణంగా వాయిదా వేశారు.హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని  పాదయాత్రకు సంజయ్ ప్లాన్ చేశారు. అనారోగ్య కారణాలతో ఈటల రాజేందర్ ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈటల రాజేందర్ పాదయాత్ర కూడ అర్ధాంతరంగా నిలిచిపోయింది.తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకొంటున్నాయి. హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తెలంగాణప్రభుత్వం అమలు చేయనుంది.

click me!