ప్రగతిభవన్ ల కూర్చొనే భూకబ్జా పనులు... టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు: దాసరి భూమయ్య (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 2, 2021, 5:21 PM IST
Highlights

చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తమ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తున్న బాధితులతో కలిసి దాసరి భూమయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ ఎమ్మెల్యే అక్రమాస్తుల గురించి బయటపెట్టారు. 

కరీంనగర్: తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు భారీగా భూములను కబ్జా పెడుతున్నారని తీన్మార్ మల్లన్న టీం స్టేట్ కన్వినర్ దాసరి భూమయ్య ఆరోపించారు. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కూడా భూ కబ్జాలకు పాల్పడ్డారని భూమయ్య ఆరోపించారు. 

చొప్పదండి ఎమ్మెల్యే తమ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తున్న బాధితులతో కలిసి భూమయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ...  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తన స్వగ్రామంలోని పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారి భూములని కబ్జా చేసారని అన్నారు. కబ్జా చేసిన భూమి తనదేనంటూ ఎమ్మెల్యే బాధితులకు నోటీసులు కూడా పంపించారని భూమయ్య పేర్కొన్నారు. 

వీడియో

ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి బలహీనవర్గాల వారి భూమిని ఎలా కబ్జా చేస్తారని భూమయ్య ప్రశ్నించారు. తమ భూమి గురించి బాధితులు ప్రశ్నిస్తే...  ఆ ల్యాండ్ ని అవసరమైతే ప్రగతిభవన్ లో కూర్చొని తన పేరుమీదరకు మార్చుకుంటానని ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని అన్నారు.  సర్వేయర్ ఆ భూమిని‌ కొలిచి పద్మశాలిలది అని చెప్పింది నిజం కాదా? అని అడిగారు. 

read more  ‘రాజీనామా చేస్తా.. లేఖ స్పీకర్ కు ఇస్తా..’ రాజాసింగ్ సంచలన ప్రకటన...

''మీరు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో చూపిన ఆస్తులు ఎన్ని...ఇప్పుడు మీ అస్తులెన్ని? మీకు బూర్గుపల్లిలో రెండు అంతస్తుల భవనం, బూర్గుపల్లి, లక్ష్మీదేవిపల్లి లో వ్యవసాయ భూములు ఎలా వచ్చాయి. కరీంనగర్ లో అపార్ట్‌మెంట్ ఎలా వచ్చింది'' అని భూమయ్య ప్రశ్నించారు. 
 
''ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి చెందిన ప్రజలు మా‌ ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అనుకుంటుంది నిజం కాదా?'' అని భూమయ్య టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.

click me!