ఎల్లుండి నుండే తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు: ఇవి తప్పనిసరి

By narsimha lodeFirst Published Aug 2, 2021, 9:33 PM IST
Highlights

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభంకానున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ ను విద్యార్థులు పాటించాలని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ ప్రకటించారు.  ఇంటర్ మార్కులను వెయిటేజీ కింద పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
 

హైదాబాద్:   ఎల్లుండి నుండి తెలంగాణలో ఎంసెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.రెండు గంటల ముందు నుండే పరీక్ష కేంద్రం లోపలికి అనుమతిస్తామని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.హాల్ టికెట్ పై లొకేషన్ కూడా ఇస్తున్నామన్నారు.

విద్యార్థులు ఒక రోజు ముందే టెస్ట్ సెంటర్ తెలుసుకోవాలని ఆయన సూచించారు.ఎంసెట్ లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో వెయిటేజి ఉండేది కానీ ఇప్పుడు లేదన్నారు.పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ఆయన కోరారుసెల్ఫ్ డిక్లరేషన్ ఫారం తప్పనిసరిగా నింపి ఇవ్వాలని ఆయన విద్యార్థులను కోరారు. కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తామన్నారు. లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.తెలంగాణలో మొత్తం 82 సెంటర్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఏపీలో మాత్రం 23 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టుగా  ఆయన వివరించారు.


 

click me!