జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ: తాజా రాజకీయాలు, సంస్థాగత వ్యవహారాలపై చర్చ

By narsimha lodeFirst Published Jul 4, 2023, 1:32 PM IST
Highlights

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  బండి సంజయ్  ఇవాళ  న్యూఢిల్లీలో  భేటీ అయ్యారు.  బీజేపీ అధ్యక్ష పదవి నుండి   బండి సంజయ్ ను తప్పిస్తారని  ప్రచారం సాగుతుంది.  ఈ  తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు  జేపీ నడ్డాతో  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  మంగళవారంనాడు న్యూఢిల్లీలో  భేటీ అయ్యారు.  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పిస్తారని  ప్రచారం సాగుతున్న తరుణంలో   నడ్డాతో బండి సంజయ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 
ముంబై నుండి న్యూఢిల్లీకి  బండి సంజయ్ నిన్ననే వెళ్లారు.  పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బండి  సంజయ్ న్యూఢిల్లీకి వెళ్లారు. 

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  అధికారం దక్కించుకోవాలని  బీజేపీ పట్టుదలగా  ఉంది.  అయితే  ఇటీవల కాలంలో పార్టీ నేతలు  చేస్తున్న ప్రకటనలు  పార్టీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.  మరో వైపు  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ను తప్పించాలని  కొందరు  నేతలు  పార్టీ అధిష్టానాన్ని  కోరినట్టుగా  కూడ  ప్రచారంలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు  వచ్చే లోక్ సభ ఎన్నికలను  దృష్టిలో ఉంచుకొని  నాయకత్వాన్ని మార్చాలనే  కొందరు  నేతలు డిమాండ్  చేస్తున్నారు. అయితే  బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుండి తప్పిస్తే  పార్టీ నష్టమనే అభిప్రాయాలను మరికొందరు నేతలు వ్యక్తం  చేస్తున్నారు. 

Latest Videos

బండి సంజయ్ ను  బీజేపీ అధ్యక్ష పదవి నుండి తప్పించి  కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే  ప్రచారం సాగుతుంది.  మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ నాయకత్వం  కీలకమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతుంది.  

click me!