Bandi Sanjay: స్మశానంలో బండి సంజయ్ దీపావళి సంబురాలు..

By Rajesh Karampoori  |  First Published Nov 13, 2023, 3:49 AM IST

Bandi Sanjay:  తెలంగాణలో ఎన్నికల సందడి మరింత పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియడంతో.. పోటీలో ఉన్న అభ్యర్థులు ఖరారు అయ్యారు. దీంతో  ప్రచారం మరింత జోరందుకుంది. ఈ తరుణంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం జరుగుతోంది.  మరోవైపు.. ఓటర్ దేవుని ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే..? 


Bandi Sanjay: ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ఎన్నికల నామినేషన్ల పర్వానికి తెరపడటంతో  ఇక ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు పడరాని పాట్లు పడుతుంటారు. ఒక్కొక్కరిని ఒక్కోలా ట్రీట్ చేస్తున్నారు. తెల్లారితే.. చాలు ఓటర్ల చూట్టు ప్రదక్షణం చేస్తున్నారు. వారితో కలిసి మమ్మేకం అవుతున్నారు. 

 కాగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్ధి బండి సంజయ్ కూడా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. ఓటర్లను తన వైపుకు తిప్పుకోవడానికి కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు.ఈ తరుణంలో బండి సంజయ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆయన తన దీపావళి వేడుకలను స్మశానంలో జరుపుకున్నారు. సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి వేడుకలను జరుపుకున్నారు. వినడానికి కాస్త విడ్డురంగా ఉంది కదా.. కానీ ఇది నిజం. 

Latest Videos

undefined

వాస్తవానికి ప్రతి యేటా కరీంనగర్‌లో దళిత కుటుంబాలన్నీ వ్యవసాయ మార్కెట్ సమీపంలోని స్మశానంలో దీపావళి వేడుకులు జరుపుకుంటారు. ఇక్కడి దళిత కుటుంబాల్నీ తమ తమ పెద్దల, పూర్వీకుల సమాధులను అలంకరించి, వారిని గుర్తు చేసుకుంటూ సమాధుల దగ్గర పూజలు చేస్తారు. సమాధుల ముందు దీపాలు వెలిగించి వారి ఆత్మలు శాంతించాలని స్మరించుకున్నారు.

టపాసులు కాల్చి వేడుకలను జరుపుకుంటారు.  సమాధుల వద్ద స్వర్గస్తులైన తమ పెద్దలు, పూర్వీకులను స్మరించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కూడా ఈ వేడుకల్లో  హాజరయ్యారు. పలు సమాధులవద్దకు వెళ్లి దళిత పెద్దలకు నివాళులు అర్పించారు. దళిత కుటుంబాలతో కలిసి దీపావళి సంబురాలు జరుపుకున్నారు. బండి రాకతో పెద్ద ఎత్తున దళితులు వచ్చి ఆయనతో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ వేడుకల కోసం అక్కడి మున్సిపల్ సిబ్బంది లైటింగ్స్, త్రాగునీటిని ఏర్పాట్లు చేశారు. పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటికల శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు.

click me!