రేపటి నుంచి కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు.. నవంబర్ 28 వరకు బ్రేక్ లేకుండా

Siva Kodati |  
Published : Nov 12, 2023, 10:04 PM IST
రేపటి నుంచి కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు.. నవంబర్ 28 వరకు బ్రేక్ లేకుండా

సారాంశం

రేపటి నుంచి కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు గులాబీ దళపతి. ఈ నెల 13 నుంచి 28 వరకు మొత్తం 54 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా సాగుతోన్న సంగతి తెలిసిందే. శుక్రవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా, ఇవాళ ఆదివారం దీపావళి కావడంతో నేతలు చాలావరకు కుటుంబంతో గడిపేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇకపోతే.. బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సీఎం కేసీఆర్. మరోసారి బీఆర్ఎస్ ఎందుకు గెలవాలో, కాంగ్రెస్ వస్తే ఏం జరుగుతుందో చెబుతూ కేసీఆర్ వాడివేడి విమర్శలు చేస్తున్నారు. రోజుకు 3 సభల్లో పాల్గొంటూ వస్తున్న ఆయన.. ప్రచార గడువు ముగిసే నాటికి వీలైనన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్లాన్ చేశారు. 

తాజాగా రేపటి నుంచి కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ అభ్యర్ధుల తరపున ప్రచారం చేయనున్నారు గులాబీ దళపతి. ఈ నెల 13 నుంచి 28 వరకు మొత్తం 54 సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ :

నవంబర్ 13 : దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్‌
నవంబర్ 14 : పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నం
నవంబర్ 15 : బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, ఎల్లారెడ్డి, మెదక్‌
నవంబర్ 16 : ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌
నవంబర్ 17 : కరీంనగర్‌, చొప్పదండి, హుజూరాబాద్‌, పరకాల
నవంబర్ 18 : చేర్యాల
నవంబర్ 19 : అలంపూర్‌, కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి
నవంబర్ 20 : మానకొండూరు, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ
నవంబర్ 21 : మధిర, వైరా, డోర్నకల్‌, సూర్యాపేట
నవంబర్ 22 : తాండూర్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, పరిగి
నవంబర్ 23 : మహేశ్వరం, వికారాబాద్‌, జహీరాబాద్‌, పటాన్‌చెరు
నవంబర్ 24 : మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి
నవంబర్ 25 : హైదరాబాద్‌
నవంబర్ 26 : ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక
నవంబర్ 27 : షాద్‌నగర్‌, చేవెళ్ల, అందోల్‌, సంగారెడ్డి
నవంబర్ 28 : వరంగల్‌ ఈస్ట్‌, వరంగ్ వెస్ట్‌, గజ్వేల్‌

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా? | Asianet News Telugu
KTR Comments on CM Revanth Reddy: అసెంబ్లీలో రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పంచ్ లు| Asianet News Telugu