ప్రభుత్వాలు శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో... తర్వాత మాదే అధికారం: కరీంనగర్ సిపికి ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

By Arun Kumar PFirst Published Jan 4, 2022, 3:27 PM IST
Highlights

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై స్పందిస్తూ కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణకు ఎమ్మెల్యే ఈటల స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

కరీంనగర్: తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ (bandi sanjay) నిబంధనలకు, కోవిడ్ రూల్స్ (covid rules) కి లోబడే తన కార్యాలయంలో జాగరణ దీక్ష (jagaran deeksha) చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (eatala rajender) ఆరోపించారు. బిజెపి (bjp) నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఏదో శత్రువుల మీద చేసినట్లు దాడికి పాల్పడ్డారని... గొడ్లను కొట్టినట్టు కొట్టి గాయపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆదేశాలతో ఓ పథకం ప్రకారం ఇదంతా జరిగిందని ఈటల ఆరోపించారు. 

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy), మాజీ ఎంపీ వివేక్ (vevek venkataswamy) తో కలిసి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా జైలుకు వెళ్లి బండి సంజయ్ ను కలిసారు. అనంతరం జాగరణ దీక్షకు సిద్దమవగా పోలీసులు విధ్వంసం సృష్టించిన కరీంనగర్ ఎంపీ కార్యాలయాన్ని వారు పరిశీలించారు. అక్కడ పోలీసులు గ్యాస్ కట్టర్లతో తొలగించిన గేట్, ధ్వంసమైన పర్నీచర్ ను పరిశీలించారు. 

Video

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... కరీంనగర్ పోలీస్ కమీషనర్ సత్యనారాయణ బాధ్యత మరచిపోయి బానిసలాగా పనిచేశారని మండిపడ్డారు. ఉద్యోగుల పక్షాన నిలిచి వారికి అన్యాయంచేసేలా తీసుకువచ్చిన 317 జీవో సవరణ చేయాలని కోరితే కక్ష సాధింపుకు దిగుతారా? అని నిలదీసారు. ప్రతిపక్షంగా తాము సూచించే అభ్యంతరాలు పరిశీలించాల్సింది పోయి పోలీసులను ఉపయోగించిన ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ఈటల మండిపడ్డారు.

read more  హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్: రిమాండ్ రిపోర్టు క్వాష్ కోరుతూ పిటిషన్

''జాగరణ దీక్ష భగ్నం, బండి సంజయ్ అరెస్ట్, ఆ తర్వాత చోటుచేసుకున్న సంఘటన దురదృష్టం, నీచం, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిమీద విచారణ జరిపి బాద్యుల మీద చర్యలు చేపట్టాలి'' అని ఈటల డిమాండ్ చేసారు.

''ఉద్యోగులకు సమస్యలు వస్తే బాధ్యతాయుతమైన సీఎం పదవిలో వున్నవారు పిలిచి మాట్లాడాలి. కానీ కేసీఆర్ ఆ పని చెయ్యలేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో భర్త ఒకదగ్గర, భార్య మరోదగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రశాంతగా సాగుతున్న ఉద్యోగుల జీవితాల్లో మట్టికొట్టి అల్లకల్లోలం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక బాద్యతగల ప్రతిపక్షంగా బీజేపీ స్పందించింది'' అని ఈటల తెలిపారు. 

''ప్రస్తుతం ఉద్యోగుల ఆవేదనకు సీఎం కేసీఆరే కారణం. గతంలో 2 జోన్లను 7 జోన్లకు పెంచి, 10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచింది టీఆర్ఎస్ ప్రభుత్వం. స్థానికత ఆధారంగా చేసుకొని ఉద్యోగుల పంపిణీ జరగాలని రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నా దానిని పట్టించుకోక పొతే ఎలా? సీనియారిటీ సైనిటిఫైక్ గా చేయండి. నీచమైన చర్యలు చేసిన మీకు తగిన బుద్ది చెప్పడం తధ్యం'' అని ఈటల హెచ్చరించారు. 

read more  బండి సంజయ్ అరెస్ట్, హైద్రాబాద్‌లో జేపీ నడ్డా ర్యాలీకి నో పర్మిషన్: తేల్చేసిన పోలీసులు

''అధికారం అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. చట్టానికి లోబడి పనిచేయాల్సిన ఐపిఎస్ లు సీఎం చెప్పినట్టు చేస్తున్నారు. కరీంనగర్ సిపి తన డ్యూటీతో పాటు హోమ్ గార్డ్, కానిస్టేబుల్, ఎస్సై డ్యూటీ కూడా చేస్తున్నారు. సీపీ గుర్తుపెట్టుకో... ప్రభుత్వాలు శాశ్వతం కాదు. 2023 తరువాత వచ్చేది మా ప్రభుత్వమే'' అంటూ హెచ్చరించారు. 

''మమ్ముల్ని ఇబ్బంది పెడితే పెట్టారు కానీ ఉద్యోగులను మాత్రం ఇబ్బంది పెట్టకండి.  రైతాంగం, కార్మికులు, ఆర్టీసీ, నిరుద్యోగుల మీద దాడులు చేశారు... ఇప్పుడు ఉద్యోగుల మీద దాడి చేస్తున్నారు. సీఎం కేసిఆర్... మీరు పెట్టిన బాధలు వారు మర్చిపోరు'' అని ఈటల రాజేందర్ అన్నారు. 

click me!