
రాజకీయ నాయకులంటే.. సభలు, సమావేశాలు, ప్రసంగాలు. నిత్యం ఏదోక అంశంపై మాట్లాడుతూనే ఉంటారు. అలాంటి సందర్బాల్లో తప్పులు దొర్లడం కొత్తేమీ కాదు. ఒక మాట బదులు మరొక మాటని నాలుక కరుచుకున్న నాయకులు ఎందరో ఉన్నారు. చాలా అలాంటి అనుభవమే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఎదురైంది.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వరంగల్ మెడికో ఆత్మహత్యాయత్నం ఘటనపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. అయితే..ఈ సమయంలో మెడికో పరిస్థితి గురించి మాట్లాడుతూ.. ఆమె బ్రతికే ఉండగా ప్రాణం పోయిందంటూ మాట్లాడటంతో బండి సంజయ్ అభాసుపాలయ్యారు. ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడే సమయంలో పొరపాటున ప్రీతి చనిపోయిందని అన్నారు.ఆమె చనిపోయినందున ఆ కుటుంబం తీవ్రంగా బాధపడుతోందని, ఆ కుటుంబానికి నాయ్యం చేయాలని అన్నారు.
ఈ ఘటన వందకు వంద శాతం లవ్ జిహాద్ కు సంబంధించిందనీ, తెలంగాణలో ఇలాంటి కేసులు తరుచుగా వెలుగులోకి వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ మతానికి చెందిన అమ్మాయిలను వారు టార్గెట్ చేస్తున్నారని, మాయ మాటలు చెప్పి.. హిందూ అమ్మాయిలను మోసం చేస్తున్నారని విరుచుకపడ్డారు. ఇలాంటి విషయాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని , ఈ విషయాన్ని బీజేపచెబుతోందని, లవ్ జిహాద్ వంటి కార్యక్రమాలను ఇతర దేశాల నుంచి నిధులు వస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. మెడికో ఘటనపై ప్రభుత్వం స్పందించలేదని బండి సంజయ్ మండిపడ్డారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలో విమర్శలు
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఆమె ఆరోగ్యం పరిస్థితి విషయంగా ఉంది. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతోంది. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం ఆ ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నది. చనిపోలేదు. ప్రీతి చావుబతుకుల మధ్య నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. డాక్టర్ ప్రీతిని హైదరాబాద్ నిమ్స్‌లో తీసుకొచ్చేప్పటికే పలు అవయవాలు పనిచేయడం ఆగిపోయాయని నిమ్స్ వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై మీడియా సంస్థలు ఎప్పటికప్పుడూ సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై అవగాహన లేకనే లేక పొరపాటునో మెడికో ప్రీతి చనిపోయిందని బండి సంజయ్ నోరుజారడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముందు వెనుక చూసుకోని మాట్లాడాలని నెటజన్లు చురకలాంటిస్తున్నారు.