ఖమ్మం జిల్లాలో బాలయ్య పర్యటన...మధ్యలో ఆగిన వాహనం

Published : Oct 02, 2018, 09:41 AM ISTUpdated : Oct 02, 2018, 09:43 AM IST
ఖమ్మం జిల్లాలో బాలయ్య పర్యటన...మధ్యలో ఆగిన వాహనం

సారాంశం

బాలకృష్ణ ఎక్కిన ప్రచార రథం పెనుబల్లి మండలం దాటగానే ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ కాలేదు.  దీంతో ఆయన వేరే వాహంలో తిరిగి తన పర్యటనను ప్రారంభించారు.  

హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా.. మధ్యలో ఆయన వాహనం మొరాయించింది.  బాలకృష్ణ ఎక్కిన ప్రచార రథం పెనుబల్లి మండలం దాటగానే ఆగిపోయింది. ఎంత ట్రై చేసినా స్టార్ట్ కాలేదు. దీంతో ఆయన వేరే వాహంలో తిరిగి తన పర్యటనను ప్రారంభించారు.

సోమవారం నందమూరి బాలకృష్ణ ఖమ్మం జిల్లాలో మధిర నుంచి సత్తుపల్లి వరకు ఓపెన్‌టాప్‌ ప్రచార రథంలో ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. తర్వాత వేరే వాహనంలో సత్తుపల్లిలో పర్యటించారు. ఆయన రావడం ఆలస్యమైనప్పటికీ అభిమానులు మాత్రం ఆయన కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. కొందరు అభిమానులు ఆయన వాహనం వెంట బైక్ ర్యాలీలు నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌