జాతీయ పార్టీ పెడితే కేసీఆర్ నవ్వులపాలౌతారు: జగ్గారెడ్డి

By narsimha lodeFirst Published Sep 7, 2020, 3:30 PM IST
Highlights

కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలౌతారని  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ప్రాంతీయ పార్టీని నడపడం వేరు... జాతీయ పార్టీని నడపడం వేరని ఆయన అభిప్రాయపడ్డారు.


హైదరాబాద్: కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే నవ్వుల పాలౌతారని  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ప్రాంతీయ పార్టీని నడపడం వేరు... జాతీయ పార్టీని నడపడం వేరని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  గడప కూడ  దాటకుండా కూర్చొంటే జాతీయ పార్టీ మనుగడ సాధ్యం కాదన్నారు. ప్రధాని పదవిని ఆశించిన మాయావతి, శరద్ పవార్ కే పార్టీని నడపడం సాధ్యం కాలేదని ఆయన గుర్తు చేశారు. 

also read:పీసీసీ రేసులో ఉన్నా: సోనియాకు జగ్గారెడ్డి లేఖ

దళిత వ్యతిరేకి కేసీఆర్ కు మాయావతి మద్దతు ఇవ్వదని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వెంట ఇతర ప్రాంతీయ పార్టీలు కూడ కలిసి నడిచే అవకాశాలు ఉండవన్నారు. శివసేన సిద్దాంతాలు, టీఆర్ఎస్ సిద్దాంతాలు కూడ వేరని ఆయన చెప్పారు. దేశ ప్రజలు  ప్రజాస్వామ్య విధానానికి అలవాటు పడ్డారని ఆయన చెప్పారు.  అధ్యక్ష తరహా పాలనను ప్రజలు హర్షించరన్నారు.

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మరోసారి ఫోకస్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. రైతు అంశాలను వేదికగా చేసుకొని కేసీఆర్ ఈ విషయమై ప్రచారం సాగుతున్న తరుణంలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు.
 

click me!