పటాన్ చెరులో అదృశ్యమైన బి.ఫార్మసీ విద్యార్ధిని క్షేమం: ఇంటికి చేరుకున్న రోషిణి

Published : Jan 24, 2023, 12:39 PM ISTUpdated : Jan 24, 2023, 12:43 PM IST
పటాన్ చెరులో అదృశ్యమైన  బి.ఫార్మసీ విద్యార్ధిని క్షేమం: ఇంటికి చేరుకున్న  రోషిణి

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని  పటాన్ చెరులో అదృశ్యమైన బి.ఫార్మసీ విద్యార్ధిని  రోషిణి  సురక్షితంగా  ఇంటికి చేరుకుంది.  రెండు రోజుల క్రితం  ఆత్మహత్య చేసుకుంటానని  రోషిణి తండ్రికి ఫోన్ చేసింది.  

సంగారెడ్డి:  జిల్లాలోని  పటాన్ చెరు నుండి అదృశ్యమైన బి. ఫార్మసీ విద్యార్ధిని  సురక్షితంగా  మంగళవారం నాడు  ఇంటికి చేరుకుంది.  గీతం యూనివర్శిటీలో  ఆమె బి. ఫార్మసీ  చదువుతుంది. ఈ నెల  16వ తేదీన  రోషిణి కాలేజీకి వెళ్తున్నట్టుగా  చెప్పి  ఇంటి నుండి వెళ్లిపోయింది.  అయితే  ఈ నెల  22న  తాను ఆత్మహత్య చేసుకుంటానని తన తండ్రికి రోషిణి ఫోన్  చేసింది.  ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో  ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. బి. ఫార్మసీ విద్యార్ధిని రోషిణి  కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే   ఇవాళ  రోషిణి ఇంటికి చేరుకుంది.

సంక్రాంతిని పురస్కరించుకొని  కాలేజీకి సెలవులు ఇవ్వడంతో  పటాన్ చెరులోని బాబాయి ఇంటికి  రోషిణి వెళ్లింది.  ఈ నెల  16న కాలేజీకి వెళ్తున్నట్టుగా  చెప్పి ఆమె  ఇంటినుండి  వెళ్లిపోయింది.   కానీ కాలేజీకి ఈ నెల  22వ తేదీ వరకు  సెలవులు.   రోషిని కన్పించకుండా  పోయిన విషయమై  పేరేంట్స్  కాలేజీకి  ఫోన్ చేస్తే  ఈ విషయం తెలిసింది. దీంతో  రోషిణి అదృశ్యమైన విషయమై  కుటుంబ సభ్యులు  పోలీసులకు  ఫిర్యాదు  చేశారు.    రోషిణి కోసం  పోలీసులు గాలిస్తున్నారు. ఇదే సమయంలో  రోషిణి  ఇంటికి చేరుకుంది. డిప్రెషన్ లో  రోషిణి ఇంటి నుండి వెళ్లిపోయినట్టుగా  భావిస్తున్నారు. ఈ నెల  16వ తేదీ నుండి  ఇప్పటివరకు  రోషిణి ఎక్కడ ఉందనే విషయమై  పోలీసులు  ఆరా తీస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu