
అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబు అయ్యింది. రామాలయం ప్రాణ ప్రతిష్ట వేడుకకు సిద్ధం అయ్యింది. దేశంతో పాటు ప్రపంచంలోని హిందువులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అపూర్వ ఘట్టానికి ఇంకా మరికొన్ని గంటలే సమయం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కడ చూసినా రామ నామ స్మరణలే వినిపిస్తున్నాయి. అయోధ్య రామాలయమే కాకుండా దేశంలోని అన్ని ఆలయాలకు కొత్త కళ వచ్చింది.
వావ్.. అంతరిక్షం నుంచి అయోధ్య ఆలయాన్ని ఫొటో తీసిన ఇస్రో శాటిలైట్.. ఎలా ఉందో చూశారా ?
అయోధ్యలో ఘనంగా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న వేళ తెలంగాణలోని హైదరాబాద్ లోనూ ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలను కృష్ణ ధర్మపరిషత్ తన భుజాలపై వేసుకుంది. హిందువుల ఐక్యతను, రాముడిపై భక్తిని చాటేలా భాగ్యనగరంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమయ్యింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ వెల్లడించారు.
షోయబ్ తో విడాకులు నిజమే.. కొత్త జంటకు విషెష్ చెప్పిన సానియా మీర్జా..
రేపు (జనవరి 22) హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ వేడుకకు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం కోసం ఆ సంస్థ నిర్వాహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేశారు. ఇందులో శ్రీరాముడి పూజలు, హునుమాన్, గణేష్ కీర్తనలు భక్తిలహరి కార్యక్రమాలు ఉండన్నున్నాయి.
అయోధ్యకు, ధనుష్కోడికి మధ్య సంబంధం ఏంటి ? ప్రధాని అక్కడ పూజలెందుకు చేశారు ? (ఫొటోలు)
దీంతో పాటు పలువురు డ్యాన్స్ ఆర్టిస్ట్ లోస్క్రీన్ పై శ్రీరామచరిత ప్రదర్శన కూడా కృష్ణ ధర్మపరిషత్ ఏర్పాటు చేయనుంది. అలాగే అయోధ్య ఆలయం గొప్పతనం, విశిష్టతను వివరించేలా రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులను ఉద్దేశించి ఆ సంస్థ సభ్యుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. ఇందులో రాజ్యసభ సభ్యుడు కే.లక్ష్మణ్ కూడా ప్రసంగిస్తారు.