ఎనిమిదో తరగతి విద్యార్థినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన.. దేహశుద్ది చేసిన తల్లిదండ్రులు..

By SumaBala Bukka  |  First Published Apr 19, 2023, 1:06 PM IST

ఓ ఆటో డ్రైవర్ ఎనిమిదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి తీసుకెళ్లకుండా దారి మళ్లించాడు. తండ్రి ఫోన్ చేయడంతో ఇంటి దగ్గర దింపాడు.


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓ ఆటో డ్రైవర్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆటో డ్రైవర్ ఆసభ్య ప్రవర్తన విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు సదరు ఆటో డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కుషాయిగూడలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఉన్న ఓ కార్పోరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. ఆమెతోపాటు మరో ముగ్గురిని రోజు స్కూల్ కి ఆటోలో యాకయ్య అనే డ్రైవర్ తీసుకు వెళుతుంటాడు. అతను శివసాయినగర్ కాలనీ నివాసి.

ఎప్పట్లాగే మంగళవారం నాడు కూడా మధ్యాహ్నం ఒంటిగంటకు స్కూలు వదిలేశారు. బాధితురాలైన విద్యార్థినితో పాటు మిగతా అందరిని ఆటోలో ఎక్కించుకుని యాకయ్య బయలుదేరాడు.  మిగిలిన ముగ్గురిని వారి వారి ఇళ్ల వద్ద వదిలేశాడు. ఆ తర్వాత బాధితురాలు అయిన విద్యార్థిని ఇంటిదగ్గర వదిలేయకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లాడు. ప్రతిరోజు స్కూలు ఒంటిగంటకు వదిలేస్తే ఒకటి ఇరవై వరకు ఇంటికి చేరుకునేది విద్యార్థిని. కానీ, ఆరోజు ఒకటిన్నర అవుతున్నా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు.  తండ్రి ఆటో డ్రైవర్ కు ఫోన్ చేశాడు.

Latest Videos

తెలంగాణ కాంగ్రెస్‌లో నిరుద్యోగ సభల చిచ్చు: రేవంత్ పై ఉత్తమ్ ఫిర్యాదు

డ్రైవర్ యాకయ్య ఫోన్ లిఫ్ట్ చేసి మిగతా పిల్లలను వదిలేస్తున్నానని.. మీ ఇంటికి దగ్గరలోనే పాపను వదిలి వెళ్తానని చెప్పాడు. ఆ తర్వాత పది నిమిషాల్లో ఆమెను ఇంటి దగ్గర వదిలేసి వెళ్లాడు. ఇంటికి వచ్చిన కూతురు తల్లిదండ్రులకు.. డ్రైవర్ గురించి చెప్పింది.  తనను ఇంటి దగ్గరికి కాకుండా వేరే చోటికి తీసుకెళ్లి తనతో ఆసభ్యంగా ప్రవర్తించాడని చెప్పింది. అది విన్న తండ్రి తీవ్ర కోపానికి లోనై…వెంటనే డ్రైవర్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిచాడు. ఏమీ తెలియనట్టు వచ్చిన యాకయ్యను కూతురు చెప్పిన విషయం మీద నిలదీసి..  దేహ శుద్ధి చేశారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. 
 

 

click me!