హైదరాబాద్ లో దారుణం... పట్టపగలే నడిరోడ్డుపై బాలుడి గొంతుకోసి సైకో (సిసి ఫుటేజి)

By Arun Kumar P  |  First Published Aug 22, 2023, 11:54 AM IST

అభం  శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలున్ని నడిరోడ్డుపై చంపడానికి ప్రయత్నించాడో సైకో ఆటో డ్రైవర్. ఈ దారుణం హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.


హైదరాబాద్ : అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ బాలుడి గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడో సైకో. హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్టలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాలుడి గొంతుకోసిన వీడియో సిసి కెమెరాలో రికార్డయ్యింది. 

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలోని ఓ కాలనీలో ఇంటిముందు ఆడుకుంటున్న ఆది అనే తొమ్మిదేళ్ల బాలున్ని ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేసాడు. బాలుడు అరవకుండా నోరు మూసి పక్క వీధిలోకి ఎత్తుకెళ్లాడు. అక్కడ అందరూ చూస్తుండగానే బాలున్ని రోడ్డుపై పడేసి బ్లేడ్ తో గొంతుకోసాడు. ఓ మహిళ దైర్యంచేసి బాలున్ని కాపాడే ప్రయత్నం చేసినా ఆటో డ్రైవర్ బెదిరించడంతో వెనక్కితగ్గింది. స్థానికులు గుమిగూడటంతో నిందితుడు పరారయ్యాడు.

Latest Videos

వీడియో

గొంతులోంచి తీవ్ర రక్తంకారుతూ అపస్మారక స్థితిలో పడివున్న బాలున్ని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. తీవ్ర రక్తస్రావంతో పాటు బ్లేడ్ తో గొంతుకోయడంతో తీవ్ర గాయమయ్యిందని... ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా వున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఆటో డ్రైవర్ బాలుడి గొంతుకోస్తున్న వీడియో సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

click me!