ఎస్ఐ చేయిచేసుకున్నాడని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో ఘటన

Published : May 18, 2023, 07:21 AM IST
ఎస్ఐ చేయిచేసుకున్నాడని ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. ఖమ్మంలో ఘటన

సారాంశం

ఓ పోలీస్ సబ్ ఇన్సిపెక్టర్ తనపై చేయి చేసుకున్నాడని ఆ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బాధితుడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. 

ఓ ఎస్ఐ తనపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తూ ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. బాధితుడిని వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. కామెపల్లి మండలంలోని పాతలింగాల గ్రామంలో అంగడి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన జీవనోపాధి కోసం ఆటో నడిపిస్తుంటారు.

వీడిన ప్రతిష్టంభన.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్.. 20న ప్రమాణ స్వీకారం..

అయితే దుర్గా ప్రసాద్ పై అదే మండలానికి చెందిన ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడు తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తనను గర్భం దాల్చేలా చేశాడని స్థానిక కామేపల్లి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు స్టేషన్ కు పిలిపించారు. అక్కడే అతడు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. 

విచారణకు హాజరుకావాలంటూ సమీర్ వాంఖడేకు సీబీఐ సమన్లు

వెంటనే పోలీసులు దుర్గాప్రసాద్ ను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే అతడి కోసం హాస్పిటల్ కు వెళ్లేందుకు భార్య ఆటోలో ఎక్కారు. కానీ మార్గ మధ్యంలో ఆమెతో ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆమె కిందకి దూకింది. దీంతో ఆమెకు గాయాలు అయ్యాయి. కన్నుకు బలమైన గాయమయ్యింది. అలాగే ఆమె దంతాలు కూడా విరిగిపోయాయి. దీంతో బాధితురాలిని కూడా అదే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

Hyderabad: తనతో కలిసి లిక్కర్ తాగలేదని భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి హత్య

కాగా.. ఈ ఘటనపై దుర్గా ప్రసాద్ పై మాట్లాడుతూ.. తనపై ఫిర్యాదు చేసిన మహిళకు తనకు ఏ సంబంధమూ లేదని అన్నారు. ఇదే విషయాన్ని ఎస్ఐకు చెప్పినా కూడా ఆయన వినలేదని ఆరోపించాడు. ఎస్ఐతో పాటు సిబ్బంది కూడా తనపై చేయి చేసుకున్నారని అతడు ఆరోపించారు. దీంతో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెప్పారు. ఈ ఘటనపై ఎస్ఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ మహిళ తనను భర్త సరిగా చూడటం లేదని, ప్రస్తుతం తాను గర్భం దాల్చానని ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీంతో వారిద్దరినీ స్టేషన్ కు పిలిపించానని అన్నారు. అక్కడే కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. తాను దుర్గాప్రసాద్ పై చేయి చేసుకోలేదని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !