హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన హెచ్‌యూటీ ఉగ్రవాదులు విధ్వంసానికి ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: ఎన్నికల ముందు విధ్వంసానికి హెచ్‌యూటీ ఉగ్రవాదులు ప్లాన్ చేశారని పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు హైద్రాబాద్ లో హెచ్‌యూటీ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 22 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 11 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు . మిగిలిన 11 మంది హైద్రాబాద్ కు చెందిన వారు.
ఈ నెల 9వ తేదీన మధ్యప్రదేశ్ ఏటీఎస్ , తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. 16 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 11 మంది భోపాల్ కు చెందిన వారు. మిగిలిన ఐదుగురు హైద్రాబాద్ వాసులు. ఈ నెల 10న హైద్రాబాద్ జవహర్ నగర్ లో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నెల 15న మరో ఇద్దరిని హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు ఏటీఎస్ టీమ్.ఈ నెల 18న హైద్రాబాద్ లో మరో ముగ్గురిని ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
undefined
హైద్రాబాద్ లో ఉంటున్న నిందితులపై దాదాపుగా ఏడాదిన్నర కాలంగా ఏటీఎస్ టీమ్ నిఘాను ఏర్పాటు చేసింది. నిందితులు విధ్వంసం చేసేందుకు ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. విధ్వంసం చేసేందుకు అవసరమైన పేలుడు పదార్ధాలు కొనుగోలు చేసే సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ కమల్ పార్టీస్టేషన్, మోతీలాల్ నెహ్రు స్టేడియం దగ్గర నిందితులు రెక్కీ నిర్వహించారని ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. టెలిగ్రామ్, వాట్సాప్ లతో పిందితులు చాటింగ్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాదు నిందితులు జూమ్ మీటింగ్ లో తరచుగా సమావేశాలు నిర్వహించినట్టుగా పోలీసులు తమ ద్యాప్తులో తేల్చాయి.
విదేశాల నుండి వస్తున్న వాయిస్ మేసేజ్ ల ఆధారంగా నిందితులు కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఎలాంటి డిజిటల్ ఎవిడెన్స్ లభ్యం కాకుండా ఉండేలా నిందితులు జాగ్రత్త పడ్డారు.
హెచ్‌యూటీలో హైద్రాబాద్ కు చెందిన వారు ఎంతమంది చేరారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. బిర్యానీ, లడ్డూ పేరుతో నిందితులు కోడ్ భాషను ఉపయోగించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకొన నిందితులు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఎన్నికల ముందు నిందితులు తమ ప్లాన్ ను అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం.