దారుణం.. కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను కాలువలో తోసేసిన తల్లి.. ముగ్గురు మృతి.. మరొకరు గల్లంతు

Published : Sep 17, 2023, 06:56 AM IST
దారుణం.. కుటుంబ కలహాలతో నలుగురు పిల్లలను కాలువలో తోసేసిన తల్లి.. ముగ్గురు మృతి.. మరొకరు గల్లంతు

సారాంశం

భర్త మందలించాడని ఓ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. తన నలుగురు పిల్లలను నీటి కాలువలోకి తోసేసింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో ఏడు నెలల బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన నాగర్ కర్నూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

నాగర్ కర్నూర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది తన నలుగురు పిల్లలను కాలువలో తోసేసింది. ఇందులో ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో ఏడు నెలల బాలుడు గల్లంతయ్యాడు. ఆ బాబు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పోలీసులు  తెలిపిన వివరాల ప్రకారం.. 

PM Modi birthday: 73 వ వసంతంలో అడుగుపెడుతున్న ప్రధాని .. దేశవ్యాప్తంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు..

బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెందిన శరబంద-లలిత దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ దంపతులు కొన్నేళ్ల కిందట ప్రేమించుకొని, కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే వీరి పిల్లలో పెద్ద కూతురు మహాలక్ష్మికి 7 సంవత్సరాలు, మరో కూతురు సాత్వికు 5 సంవత్సరాలు, మరో కూతురు మంజులకు 3 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఇటీవల వారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ బాబు వయస్సు 7 నెలలు ఉంటుంది.

తాను మంత్రినని గ్రహించి మాట్లాడాలి..: ఉదయనిధిపై నిర్మలా సీతారామన్ ఫైర్

కాగా.. శరబంద పశువుల కాపరిగా పని చేస్తూ జీవనం సాగిస్తుండగా.. లలిత కూడా కూలి పనులకు వెళ్లేది. అయితే ఆమె కొంత కాలంగా కల్లు తాగడం మొదలుపెట్టింది. దీంతో ఇంటి దగ్గరే ఉంటోంది. దీంతో భర్త ఇది సరైంది కాదంటూ మందలిస్తుండేవారు. ఈ క్రమంలో ఇదే విషయంలో శుక్రవారం ఈ దంపతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో లలిత మనస్థాపానికి గురైంది. 

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన కేసీఆర్

మరుసటి రోజు ఉదయం అంటే శనివారం శరబంద పలు పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఇదే సరైన సమయం అనుకొని లలిత తన నలుగురు పిల్లలను తీసుకొని బస్సులో బిజినేపల్లి శివారులో ఉన్న కేఎల్ఐ కాలువ వద్దకు వచ్చారు. వెంటనే పిల్లలందరినీ నీటిలోకి తోసేసింది. తరువాత తాను చేస్తోంది తప్పని గ్రహించిందో ఏమో తెలియదు గానీ పిల్లలను కాపాడండి.. కాపాడండి అంటూ గట్టిగా అరిచింది. దీంతో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని కాలువలోకి దిగి గాలించారు. దీంతో పెద్ద కూతురు మహాలక్ష్మి, సాత్విక, మంజుల డెడ్ బాడీలు దొరికాయి. ఏడు నెలల బాలుడైన మార్కెండేయ గల్లంతయ్యాడు. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu