కాంగ్రెస్ లో ఓడిపోయే సీఎం అభ్యర్థులు వీళ్లే: కేటీఆర్

Published : Dec 08, 2018, 08:21 PM IST
కాంగ్రెస్ లో ఓడిపోయే సీఎం అభ్యర్థులు వీళ్లే:  కేటీఆర్

సారాంశం

తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తామంటూనే ప్రతిపక్ష పార్టీ గుండెల్లో గుబులు పెంచుతున్నారు. నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమి పాలవుతారంటూ ప్రకటించి బాంబు పేల్చారు. 

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వస్తామంటూనే ప్రతిపక్ష పార్టీ గుండెల్లో గుబులు పెంచుతున్నారు. నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఓటమి పాలవుతారంటూ ప్రకటించి బాంబు పేల్చారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆశలు ఆడియాసలేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో తామే సీఎం అభ్యర్థులుగా ప్రకటించుకుంటూ తిరుగుతున్న నలుగురు అభ్యర్థులు ఓటమి ఖాయమంటూ ప్రకటించారు. 

వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ హోంశాఖ మంత్రి కె.జానారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీమంత్రి డీకే అరుణ. ఈ నలుగురు ఓటమి ఖాయమంటున్నారు. 

కందూరు జానారెడ్డి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోకవర్గం నుంచి పోటీ చేస్తుండగా మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇకపోతే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

అటు మాజీమంత్రి డీకే అరుణ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజవకర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉన్నారు. అయితే వీరు ఓడిపోతారని చెప్తుండటంతో భారీగా బెట్టింగ్ రాయుళ్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.    
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే