
హైదరాబాద్: తాను తెలంగాణకు కాబోయే సీఎం కేసీఆర్‌తో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సమావేశం కానున్నట్టు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం నాడు సీఎం కేసీఆర్‌తో ఫోన్ లో మాట్లాడారు.సీఎం కేసీఆర్ వినతి మేరకు సోమవారం నాడు అసద్ కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.
మధ్యాహ్నం పూట కేసీఆర్‌తో అసద్ సమావేశం కానున్నారు. ఈ మేరకు అసద్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం కాబోయే సీఎం కేసీఆర్‌తో సమావేశం కానున్నట్టు ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ పక్షానే తాము నిలుస్తామని ఆయన మరోసారి స్పష్టత ఇచ్చారు.స్వంత బలం మీద కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని అసద్ అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు
ఫలితాల ముందే హైటెన్షన్: కేసీఆర్‌తో అసద్ భేటీ, గవర్నర్‌తో కూటమి నేతలు