TPCC: టీపీసీసీ చీఫ్ బాధ్యతలు బీసీ నేతకు? రేవంత్ రెడ్డి తర్వాత అధ్యక్షుడు ఆయనేనా?

By Mahesh K  |  First Published Jan 12, 2024, 4:11 PM IST

రేవంత్ రెడ్డి తర్వాత తదుపరి టీపీసీసీ చీఫ్‌గా ఓ బీసీ నేతను కాంగ్రెస్ హైకమాండ్ నియమించబోతున్నది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో టీపీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి త్వరలోనే ఆయన తప్పుకోబుతున్నట్టు తెలిసింది. బీసీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్, మధు యాష్కిల పేర్లు ఇందుకు పోటీలో ఉన్నట్టు సమాచారం.
 


Revanth Reddy: టీపీసీసీ చీఫ్ బాధ్యతలు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగానూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఈ రెండు బాధ్యతలు ఒక్కరే నిర్వహించరు. సాధారణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారు. ఇప్పుడు తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి రేవంత్ రెడ్డి తప్పుకుంటారు. ఆ తర్వాత కొత్త నాయకుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమిస్తుంది.

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు చేపట్టారు. ఇద్దరూ రెడ్డీ సామాజిక వర్గానికి చెందినవారే. కాబట్టి, ఈ సారి తదుపరి టీపీసీసీ నాయకత్వ బాధ్యతలను ఓ బీసీ నేతను అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్టు ఓ సీనియర్ టీపీసీసీ నాయకుడు తెలిపారు. దీంతో తదుపరి టీపీసీసీ చీఫ్ ఎవరు అనే ఆసక్తి ఏర్పడింది. ఆ బీసీ లీడర్ ఎవరూ అనే చర్చ కూడా ఉన్నది.

Latest Videos

టీపీసీసీ చీఫ్ పదవి కోసం మహేశ్ కుమార్ గౌడ్ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయన టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా బాధ్యతల్లో ఉన్నారు. ఈయనతోపాటు నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి కూడా పోటీలో ఉన్నట్టు తెలిసింది.

Also Read : పందెం కోడి: సజ్జనార్ సార్ ఆ కోడి నాదే.. వేలాన్ని ఆపండి సార్.. మహేశ్ విజ్ఞప్తి

మహేశ్ కుమార్ గౌడ్‌ నిజామాబాద్ అర్బన్ సీటు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సింది. కానీ, ఆ సీటును చివరి నిమిషంలో షబ్బీర్ అలీకి ఇచ్చారు. రేవంత్ రెడ్డి రెండో స్థానంగా కామారెడ్డి నుంచి పోటీ చేయడంతో ఈ సర్దుబాటు అనివార్యమైంది. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి షబ్బీర్ అలీ కూడా ఓడిపోయారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో టీపీసీసీ చీఫ్‌గా మరో నాయకుడిని నియమించనున్నట్టు ఆ సీనియర్ లీడర్ తెలిపారు. ఈ పోస్టుకు మహేశ్ కుమార్ గౌడ్ పేరు ప్రముఖంగా ఉన్నదనీ వివరించారు.

click me!