కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది.. అసలు సినిమా ముందుంది. ఫిబ్రవరి నుంచి సినిమా అంటే ఏంటో చూపిస్తాం అన్నారు. కాంగ్రెస్ ప్రజలకి తప్పుడు హామీలు ఇచ్చింది.
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా ఎన్నో రోజులు పట్టదని ఫిబ్రవరి నుంచి సినిమా చూపిస్తామంటూ కేటీఆర్ అన్నారు. ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు.
కాంగ్రెస్ కళ్ళులేని కబోదిలా వ్యవహరిస్తోందని, పదేళ్లపాటు చేసిన అభివృద్ధి కళ్ళముందే కనిపిస్తున్నా విమర్శిస్తోందంటూ మండిపడ్డారు. త్వరలోనే కెసిఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారు. కాంగ్రెస్ పార్టీకి ఇక సినిమా చూపించడమే. ఇప్పుడే ట్రైలర్ స్టార్ట్ అయింది.. అసలు సినిమా ముందుంది. ఫిబ్రవరి నుంచి సినిమా అంటే ఏంటో చూపిస్తాం అన్నారు. కాంగ్రెస్ ప్రజలకి తప్పుడు హామీలు ఇచ్చింది.
undefined
అది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది... : హరీష్ రావు
వారిచ్చిన 420 హామీలు అమలు చేసేంతవరకు ప్రజల తరఫున టిఆర్ఎస్ పోరాటం చేయాలని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల పుస్తకాన్ని భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలాగా చదివి వాటిని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేంత దాకా వదిలిపెట్టొద్దని.. ఐదేళ్లపాటు సినిమా చూపించాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ మాత్రమే అన్నారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కరపత్రంలా ఉందంటూ విమర్శించారు. ఇష్టం వచ్చిన రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన దుష్ప్రచారం చేస్తున్నారని.. సెక్రటేరియట్ మీడియా పాయింట్లో మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాశరావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, గెలుపోటములు సహజమని చెప్పుకొచ్చారు.