హైదరాబాద్ : పరేడ్ గ్రౌండ్స్‌లో మోడీ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’గా నామకరణం

By Siva KodatiFirst Published Jun 28, 2022, 7:14 PM IST
Highlights

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా జూలై 3న సికింద్రాబాద్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు ‘విజయ సంకల్ప సభ’గా బీజేపీ నామకరణం చేసింది. 

జూలై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో (parade ground secunderabad) బీజేపీ (bjp) నిర్వహించనున్న సభకు ‘విజయ సంకల్ప సభ’గా నామకరణం చేశారు. హెచ్ఐసీసీ నోవాటెల్ లో ప్రధాని మోడీ (narendra modi) సహా ఇతర ప్రముఖులు బస చేయనున్నారు. జూలై 2న బేగంపేట విమానాశ్రయం నుంచి హెచ్ఐసీసీ నోవాటెల్ కు హెలికాఫ్టర్ లో చేరుకోనున్నారు ప్రధాని. 3వ తేదీన లంచ్ లో తెలంగాణ వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు. నియోజకవర్గాల్లో బస చేసే జాతీయ కార్యవర్గ సభ్యుల షెడ్యూల్ సైతం ఖరారు చేశారు. శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులతో సమావేశమై.. పోలింగ్ బూత్ ల వారీగా పార్టీ పరిస్ధితిపై సమీక్షించనున్నారు. నియోజకవర్గాల్లోని ప్రముఖులతో భేటీ కానున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. 

ALso Read:బీజేపీ‌ ‘ఫ్లెక్సీకి ’ హైదరాబాద్‌లో చోటు కరువు.. కేసీఆర్ వ్యూహం, తలపట్టుకుంటున్న కమలనాథులు

మరోవైపు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలోనే తాము తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలియజేసేలా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది. జూలై మొదటి వారంలో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా జూలై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకు మోదీ హాజరుకానున్నారు. దీంతో హైదరాబాద్‌లో విస్తృతంగా ప్రచారం సాగించాలని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సందర్భంలో ఏ పార్టీ అయినా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తుంటాయి. అయితే బీజేపీకి టీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. 

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (bjp national executive meeting) జరుగుతున్న వేళ.. హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కనిపించేలా టీఆర్ఎస్ వ్యుహాలు రచించింది. నగరంలో టీఆర్ఎస్ (trs) బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉండేలా ప్లాన్ చేసింది. అంతేకాకుండా మెట్రో పిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలిపేలా  ప్రకటనలతో నింపేసింది. హోర్డింగ్స్‌లో కేసీఆర్ ఫొటో ఉండేలా.. రైతుబంధు, దళిత బంధు, కేసీఆర్‌ కిట్‌, ఆసరా పింఛన్‌, కల్యాణలక్ష్మి, రైతు భీమా తదితర పథకాలను ప్రచారం చేయనుంది. ఇందుకోసం.. ఎల్ అండ్ టీ, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో ఒప్పందం కుదుర్చుకుందని సమాచారాం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రోజులతో పాటు.. అందుకు ముందు, వెనకాల రెండు రోజుల్లో(మొత్తం వారం రోజులు)  తమ ప్రకటనల కోసం ఈ ఒప్పందాలు కుదుర్చుకుందని తెలుస్తోంది. మరోవైపు నగరంలోని బస్టాప్‌లలో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

click me!