Army Recruitment Rally: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఖమ్మంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

By Mahesh Rajamoni  |  First Published Jul 29, 2023, 3:35 PM IST

Army Recruitment Rally: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఖమ్మంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను ఈ-మెయిల్ ద్వారా పంపించారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుల్లో పేర్కొన్న విధంగా ర్యాలీ వేదిక వద్ద సకాలంలో, సూచించిన తేదీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. 
 


Agniveer Army Recruitment Rally: సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఖమ్మంలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను ఈ-మెయిల్ ద్వారా పంపించారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుల్లో పేర్కొన్న విధంగా ర్యాలీ వేదిక వద్ద సకాలంలో, సూచించిన తేదీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE) (ఏప్రిల్ 17 నుండి 26 వరకు నిర్వహించారు) ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం భారత సైన్యం సెప్టెంబర్ 1 నుండి 8 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనుంది.

Latest Videos

షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు అడ్మిట్ కార్డ్‌లు ఇ-మెయిల్ ద్వారా పంపబడ్డాయి. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌లలో పేర్కొన్న విధంగా సమయం, తేదీలో ర్యాలీ వేదిక వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులందరూ ర్యాలీ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా పూర్తి పత్రాలను తీసుకురావాలి. అసంపూర్ణ పత్రాలు కలిగిన అభ్యర్థులు తిరస్కరించబడతారు. ర్యాలీకి సిక్కు అభ్యర్థులు మినహా అభ్యర్థులందరూ క్లీన్ షేవ్ చేయించుకోవాలి. గడ్డంతో ఉన్న అభ్యర్థులను ర్యాలీ గ్రౌండ్‌లోకి అనుమతించరు.

గుజార‌త్ లోనూ..

గుజరాత్ రాష్ట్రంలోని 20 జిల్లాలు, 02 కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల కోసం ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ జూలై 29 నుంచి 2023 ఆగస్టు 8 వరకు సబర్ స్టేడియం, హిమ్మత్ నగర్, సబర్ కాంతలో జరగనుందని సంబంధిత అధికారులు తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ (అన్ని ఆర్మ్స్), అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్/ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ (అన్ని ఆర్మ్స్), అగ్నివీర్ ట్రేడ్స్మన్ (10వ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్మన్ (8వ పాస్) (అన్ని ఆర్మ్స్) (హౌస్ కీపర్ అండ్ మెస్ కీపర్) విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి.

ఈ ర్యాలీ ఆనంద్, వల్సాద్, తాపీ, డాంగ్స్, నవసరి, సబర్కాంత, వడోదర, మెహసానా, సూరత్, బనస్కాంత, నర్మదా, మహిసాగర్, అహ్మదాబాద్, గాంధీనగర్, ఆరవ్ అలీ, ఛోటా ఉదేపూర్, బరూచ్, కెహ్డా  దాహోద్, పంచమహల్, డామన్, దాద్రా  నగర్ హవేలీ ప్రాంతాల అభ్యర్థులకు వర్తిస్తుంది.

click me!