తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ కనెక్టింగ్ హైవే జలమయం.. నిలిచిన రాకపోకలు

By Mahesh Rajamoni  |  First Published Jul 29, 2023, 2:41 PM IST

Hyderabad: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ కనెక్టింగ్ హైవే జలమయం కావ‌డంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. తెలంగాణను పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ కు కలిపే హైవే వరదల్లో చిక్కుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయ‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు తెలిపాయి.


Telangana-Chhattisgarh highway: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ కనెక్టింగ్ హైవే జలమయం కావ‌డంతో రాక‌పోక‌లు నిలిచిపోయాయి. తెలంగాణను పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ కు కలిపే హైవే వరదల్లో చిక్కుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయ‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు తెలిపాయి. అయితే, గ‌త రెండు రోజుల‌తో పోలిస్తే రాష్ట్రంలో వ‌ర్షాలు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి.

వివ‌రాల్లోకెళ్తే.. గ‌త ఐదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులువంక‌లు పొంగిపొర్లుతున్నాయి. జ‌లాశ‌యాల్లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే భద్రాచలం వద్ద గోదావరి నది మూడో ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో రెండు రాష్ట్రాలను కలిపే హైవే వరదల్లో చిక్కుకోవడంతో తెలంగాణ, చత్తీస్ గఢ్ ల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం సాయంత్రానికి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయానికి నీటిమట్టం 54.50 అడుగులకు చేరింది. అధికారులు 14.92 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో రెండు రోజులుగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.

Latest Videos

తెలంగాణను పొరుగున ఉన్న ఛత్తీస్ గఢ్ కు కలిపే హైవే జలమయం కావడంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయ‌ని అధికారులు తెలిపారు. కాగా, నీటిమట్టం క్ర‌మంగా పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే నీటి మట్టం 60 అడుగులు దాటినా జిల్లా యంత్రాంగం పరిస్థితిని చక్కదిద్దగలదనీ, ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. కరకట్ట బలహీనపడిందన్న వదంతులను ఆమె తోసిపుచ్చారు. గత ఏడాది నీటిమట్టం 71.6 అడుగులకు చేరినప్పుడు పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు.

జిల్లా యంత్రాంగం తొమ్మిది మండలాల్లో పునరావాస కేంద్రాలను ప్రారంభించింది. పద్నాలుగు పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. 44 ఆవాసాల నుంచి ప్రజలను ఖాళీ చేయించి ఈ కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ తెలిపారు. నీటిమట్టం 60 అడుగులకు కూడా చేరే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నీటిమట్టం 60 అడుగులకు చేరితే ముంపునకు గురయ్యే గ్రామాలను అధికారులు గుర్తించి వాటి తరలింపునకు చర్యలు చేపట్టారు.

click me!