కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం: పోలీసుల గాలింపు

Published : Sep 05, 2021, 02:33 PM IST
కామారెడ్డి జిల్లాలో ఆర్మీ జవాన్ అదృశ్యం: పోలీసుల గాలింపు

సారాంశం

కామారెడ్డి జిల్లా తిమ్మర్ పల్లి గ్రామానికి చెందిన కెంగగెర్ల నవీన్ ఆష్టు 4 న స్వగ్రామానికి వచ్చాడు. ఆగష్టు 29న  కామారెడ్డి కొత్తబస్టాండ్ నుండి జోథ్ పూర్ వెళ్లేందుకు హైద్రాబాద్ వెళ్లాడు.

కామారెడ్డి: విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆర్మీ జవాన్ నవీన్ అదృశ్యమయ్యాడు. ఆయన ఫోన్ స్విచ్ఛాప్ అయినట్టుగా  కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ విషయమై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లి గ్రామానికి చెందిన జవాను కెంగర్ల నవీన్ ఆగస్టు 4వ తేదీన సెలవు నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. ఆగస్టు 29వ తేదీన విధులకు హాజరయ్యేందుకు జోథ్‌పూర్ వెళ్లడానికి కామారెడ్డి కొత్త బస్టాండ్ లో ఆయన హైద్రాబాద్ బస్సు ఎక్కాడు.

గత నె 30వ తేదీ నుండి నవీన్  ఫోన్ స్విచ్ఛాప్ వస్తోందని కుటుంబసభ్యులు గుర్తించారు. ఆర్మీ అధికారులకు పోన్ చేసి నవీన్ గురించి కుటుంబసభ్యులు వాకబు చేశారు. అయితే నవీన్  విధులకు హాజరు కాలేదని ఆర్మీ అధికారలుు ప్రకటించారు.   దీంతో నవీన్ కోసం పలు చోట్ల గాలించారు. కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో కామారెడ్డి పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్