ఆర్మూర్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి.. వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

By Rajesh KarampooriFirst Published Jan 25, 2023, 4:00 AM IST
Highlights

ప్రేమకు కులమత వ్యత్యాసాలు ఉండవు. ఆకర్షణ.. పరిచయం చిగురిస్తే చాలు స్నేహితులై.. ఆపై ప్రేమికులై ఒకరి కోసం ఒకరు అనేంతగా దగ్గరవువుతుంటారు యువతీయువకులు. అలాగే తమ ప్రేమను పెళ్లి పీటలెక్కించి సుఖాంతం చేసుకుంటుంటారు.  ఆర్మూర్  అబ్బాయి.. అమెరికా అమ్మాయి. పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్షంలోనే.. క్రైస్తవ వివాహ సంప్రదాయ పద్దతిలో వివాహ బంధంతో  ఒక్కటయ్యారు

ప్రేమకు కులం, మతం, ప్రాంతం అనే వ్యత్యాసాలు ఉండవు. ఒక్క‌సారి పరిచయం చిగురిస్తే చాలు..  స్నేహితులుగా మారుతారు. ఇద్ద‌రి అభిప్రాయాలు క‌లిస్తే చాలు.. ప్రేమికులై ఒకరి కోసం ఒకరు అనేలా దగ్గరవువుతుంటారు యువతీయువకులు. ఆ ప్రేమికులు ఖండంత‌రాల్లో ఉన్న ఒకరికి మరొకరూ అనేలా మారుతారు. తమ నిజ‌మైన  ప్రేమను పెళ్లి పీటలెక్కించి.. ముళ్ల బంధంతో ఒక్క‌టవుతారు.

త‌మ ప్రేమ‌ క‌థ‌కు శుభంకార్డు వేసుకుంటారు. ఇలా.. త‌మ ప్రేమకు  దేశాలు, ఖండాలు  ఏ మాత్రం అడ్డుకావనీ నిరూపించారు ఆర్మూర్  అబ్బాయి.. అమెరికా అమ్మాయి. పెద్దలను ఒప్పించి మరీ వారి సమక్షంలోనే.. క్రైస్తవ వివాహ సంప్రదాయ పద్దతిలో వివాహ బంధంతో  భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు. వీరి పెళ్లి వేడుకకు రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై.. ఆ న‌వ‌దంప‌తుల‌ను  ఆశీర్వాదించారు. 

వివరాల్లోకెళ్లే..  నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందుపేట్ గ్రామానికి చెందిన మూగ ఆకాష్.. చర్చి ఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్నాడు. ఐదేళ్ల కిందట.. అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆమె భారత్‌లో క్రైస్తవ మిషనరీల్లో నర్సుగా సేవలందిస్తోంది . వారిద్దరి పరిచయం కొన్ని రోజులకే ప్రేమగా మారింది.

దాదాపు ఐదేళ్ల తర్వాత.. తల్లిదండ్రులను ఒప్పించి ఓ వివాహం చేసుకున్నారు. మంగళవారం ఆర్మూర్‌లోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో క్రైస్తవ పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరిద్దరిని ఆశీర్వదించడానికి స్థానికంగా ఉన్న బంధువులతో పాటు.. అమ్మాయి తరుపు విదేశీ బంధువులు కూడా తరలివచ్చారు. ఇష్టపడ్డ తాము పెళ్లితో ఒక్కటి కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని చెబుతోంది ఆ జంట. అందుకే ఈ వివాహం స్థానికులను అంతలా ఆకట్టుకుంది.

click me!