Telangana : నన్ను చంపేందుకు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుట్రలు..: బిజెపి ఎమ్మెల్యే సంచలనం

By Arun Kumar P  |  First Published Dec 14, 2023, 11:07 AM IST

తనను చంపేందుకు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారు... ఇప్పటివరకు వందకు పైగా దేశవిదేశాల నుండి బెదిరింపు కాల్స్ వచ్చాయని బిజెపి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. 


ఆర్మూర్ : తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తనకు ప్రాణహాని వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడమే కాదు అతడి అవినీతి, అక్రమాల గురించి బయటపెడుతున్నందుకే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను అంతమొందించేందుకు కుట్రలు పన్నారని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేసారు. 

దేశంలోని వివిధ ప్రాంతాలనుండే కాదు విదేశాల నుండి కూడా చంపుతామంటూ  బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బిజెపి ఎమ్మెల్యే రాకేశ్ తెలిపారు. తనను బెదిరించినంత మాత్రాన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టడం ఆపబోనని... ప్రజల కోసం ప్రాణత్యాగానికైనా సిద్దమేనని అన్నారు. ఆర్మూరులో సహజసంపదను ఇంతకాలం విచ్చలవిడిగా దోచుకున్నారని... ఇక వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ఆర్మూరులోని అక్రమ క్వారీలు, మొరం తవ్వకాలపై సిబిఐ విచారణ జరగాలని రాకేశ్ రెడ్డి డిమాండ్ చేసారు. 

Latest Videos

Also Read  Seethakka : మహిళా మంత్రి సొంతూరుకు 'మహాలక్ష్మి'

ఇదిలావుంటే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన "జీవన్ మాల్" కు ఆర్టిసి అధికారులు నోటీసులు జారీ చేసారు. ఆర్టిసి స్థలంలో వున్న ఈ భారీ కాంప్లెక్స్ కు సంబంధించిన లీజు డబ్బులను చెల్లించడంలేదట. కానీ ఇన్నిరోజులు బిఆర్ఎస్ అధికారంలో వుండటంతో  అధికార పార్టీ ఎమ్మెల్యేను ఎవరూ ప్రశ్నించే సాహసం చేయలేదు. అయితే ఇటీవల బిఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకావడంతో జీవన్ మాల్ వ్యవహారంపై టీఎస్ ఆర్టిసి అధికారులు చర్యలు ప్రారంభించారు. 

ఆర్టిసితో చేసుకున్న ఒప్పందం ప్రకారం లీజు డబ్బులు చెల్లించకపోవడంతో జీవన్ మాల్ ను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. రూ.8 కోట్ల మేర జీవన్ మాల్ బకాయిలు వున్నాయని... వాటిని వెంటనే చెల్లించాలంటూ బహిరంగంగా మైకు ద్వారా ప్రకటన చేసారు. బకాయి డబ్బులు చెల్లించకుంటూ మాల్ ను సీజ్ చేస్తామని ఆర్టసి అధికారులు హెచ్చరించారు. 

అధికారులు నోటీసులకు స్పందించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బకాయిల చెల్లింపు చేస్తున్నారని టీఎస్ ఆర్టిసి ఎండీ సజ్జనార్ తెలిపారు. మొండి బకాయిల వసూలుకు అన్ని జిల్లాల ఆర్టిసి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు. 
 

click me!