వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల లోబీపీ, బలహీనతతో ఆసుపత్రిలో చేరినట్టుగా అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఇవాళ ఉదయం షర్మిల ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ను ప్రకటించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను ఇవాళ లేదా రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు ప్రకటించారు. తన పాదయాత్రకు అనుమతిని కోరుతూ వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేస్తున్నారు. షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీంతో ఆమెను ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. లోబీపీ, బలహీనతతో వైఎస్ షర్మిల ఆదివారం నాడు తెల్లవారుజామున అపోలో ఆసుపత్రిలో ఆడ్మిట్ అయ్యారని ఆపోలో వైద్యులు ప్రకటించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అపోలో వైద్యులు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు.
షర్మిలకు డీహైడ్రేషన్,ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని వైద్యులు ప్రకటించారు. షర్మిలకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ ఉందని వైద్యులు వివరించారు. ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యలు ఆ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. షర్మిలకు చికిత్స కొనసాగిస్టున్నట్టుగా వైద్యులు తెలిపారు. రెండు లేదా మూడు వారాల పాటు షర్మిల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఈ నెల 9వ తేదీ నుండి షర్మిల తన ప్రజాప్రస్థానం పాదయాత్రను కొనసాగించాలని భావించారు. కానీ వరంగల్ పోలీసులు మాత్రం ఆమెకు అనుమతిని ఇవ్వలేదు. దీంతో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద షర్మిల తన పాదయాత్రకు అనుమతి కోసం ఆమరణ దీక్షకు దిగారు. షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకొని లోటస్ పాండ్ వద్ద వదిలేశారు. లోటస్ పాండ్ వద్దే షర్మిల దీక్షకు దిగారు. ఆదివారంనాడు తెల్లవారుజామున షర్మిల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. షర్మిలను అపోలో ఆసుపత్రికి తరలించారు.
ఈ ఏడాది నవంబర్ 27న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.ఈ విమర్శలు చేసిన షర్మిల క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నవంబర్ 28న షర్మిల పాదయాత్రకు బీఆర్ఎష్ నేతలు ఆటంకం సృష్టించారు. లింగగిరిలో షర్మిల బస చేసే వాహనానికి నిప్పు పెట్టారు. షర్మిలను నర్సంపేట నుండి తీసుకొచ్చి హైద్రాబాద్ లోటస్ పాండ్ లో వదిలిపెట్టారు. నవంబర్ 29న ప్రగతి భవన్ వద్ద బీఆర్ఎస్ చేతిలో దెబ్బతిన్న వాహనాలతో ధర్నాకు వైఎస్ షర్మిల ప్లాన్ చేశారు. షర్మిల ప్రగతి భవన్ వైపునకు వెళ్తున్న సమయంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నవంబర్ 29న పాదయాత్రకు అనుమతిని కోరుతూ వైఎస్ఆర్‌టీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు పాదయాత్రకు అనుమతిని ఇచ్చింది.
also read:పాదయాత్రకు వరంగల్ పోలీసుల అనుమతి నిరాకరణ: భవిష్యత్తు కార్యాచరణపై నేతలతో షర్మిల చర్చలు
ఈ పాదయాత్రను ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభించాలని షర్మిల ప్లాన్ చేసుకున్నారు. పాదయాత్రకు అనుమమతి కోరుతూ ఈ నెల 3వ తేదీన వైఎస్ఆర్‌టీపీ నేతలు ధరఖాస్తు చేసుకున్నారు. కానీ పాదయాత్రకు అనుమతివ్వలేదు. వైఎస్ఆర్‌టీపీకి పోలీసులు షోకాజ్ నోటీసు ఇచ్చారు.ఈ నెల 4వ తేదీన షోకాజ్ నోటీసుకు వైఎస్ఆర్‌టీపీ నేతలు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత కూడా అనుమతిని కోరుతూ పోలీసులకు ఆ పార్టీ నేతలు ధరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ నెల 9వ తేదీన మరోసారి వరంగల్ పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో షర్మిల ఆమరణ నిరహార దీక్షకు దిగారు.