సీబీఐ అధికారుల బృందం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత ను సీబీఐ అధికారులు సమాచారాన్ని సేకరించనున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసానికి ఆదివారం నాడు ఉదయం సీబీఐ అధికారుల బృందం చేరుకుంది. ఆరుగురు అధికారులతో సీబీఐ బృందం కవిత ఇంటికి చేరకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారులు కవిత నుండి సమాచారాన్ని సేకరించనున్నారు. రెండు వాహనాల్లో ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం కవిత ఇంటికి చేరుకున్నారు. సీబీఐ గెస్ట్ హౌస్ నుండి నేరుగా సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చారు. సీబీఐ అధికారుల బృందంలో ఓ మహిళా అధికారి కూడా ఉన్నారు. ఈ బృందానికి సీబీఐ డీఐజీ రాఘవేంద్ర వత్స నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో ఆరుగురు సభ్యులున్నారు. ఒక మహిళా అధికారితో పాటు ఐదుగురు పురుష అధికారులు ఈ టీమ్ లో ఉన్నారు.
సీబీఐ అధికారులు రావడానికి అరగంట ముందే న్యాయవాదులు కవిత ఇంటికి చేరుకున్నారు. సీబీఐ అధికారులు కవిత నుండి సమాచారం సేకరించే సమయంలో కవితతో పాటు ఆమె న్యాయవాదులు కూడా ఉండే అవకాశం ఉంది. సీబీఐ అధికారుల సమాచార సేకరణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేంందుకు గాను గదిని కేటాయించారు కవిత.ఈ గదిలోనే సీబీఐ అధికారులు కవిత నుండి సమాచారాన్ని సేకరించనున్నారు.
also read:కవిత ఇంటికి చేరుకున్న న్యాయవాదులు: కాసేపట్లో రానున్న సీబీఐ బృందం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 2వ తేదీన సీబీఐ అధికారులు కవితకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా ఈ నెల 6వ తేదీన తన నుండి సమాచారం సేకరించేందుకు కవిత అంగీకరించారు. ఈ నెల 3వ తేదీన ప్రగతి భవన్ లో ఈ నోటీసులపై న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత చార్జీషీట్, ఎఫ్ఐఆర్ కాపీలను పంపాలని సీబీఐకి కవిత లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా సీబీఐ అధికారులు కవితకు సమాచారం పంపారు.ఈ సమాచారాన్ని మరోసారి న్యాయ నిపుణులతో కవిత ప్రగతి భవన్ లో చర్చించారు. ఎ
ఫ్ఐఆర్, చార్జీషీట్ లో తన పేరు లేదని సీబీఐకి కవిత తెలిపింది. అయినా చట్టాన్ని తాను గౌరవిస్తానని కవిత చెప్పారు. ఈ నెల 11,12, 14,15 తేదీల్లో తాను హైద్రాబాద్ లో అందుబాటులో ఉంటానని తెలిపింది.ఈ తేదీల్లో ఏదో ఒక రోజున రావాలని సీబీఐకి సమాచారం పంపింది. ఈ నెల 6వ తేదీన తాను అందుబాటులో ఉండనని ఆ లేఖలో స్పష్టం చేసింది. దీంతో ఈ నెల 6వ తేదీ సాయంత్రం సీబీఐ నుండి కవితకు మెయిల్ వచ్చింది,ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు సమాచార సేకరణకు రానున్నట్టుగా సీబీఐ అధికారులు సమాచారం పంపారు.
దీంతో ఇవాళ సీబీఐ అధికారులు కవిత ఇంటికి చేరుకున్నారు. నిర్ణీత సమయానికి కవిత ఇంటికి వచ్చారు. న్యూఢిల్లీ నుండి సుమారు ఎనిమిది మంది అధికారుల బృందం నిన్న హైద్రాబాద్ కు వచ్చింది. అయితే ఆరుగురు అధికారులు ఇవాళ కవిత ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వెల్లడైంది. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టు వెలుగు చూసిన మరునాడే కవితకు సీబీఐ అధికారులు నోటీసులు పంపారు.