ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు: తేలని అధికారుల చర్చలు, మరోసారి భేటీ

By narsimha lodeFirst Published Aug 24, 2020, 6:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో  రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కన్పించలేదు. దీంతో మరోసారి రెండు రాష్ట్రాల అధికారులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయంలో  రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చల్లో పురోగతి కన్పించలేదు. దీంతో మరోసారి రెండు రాష్ట్రాల అధికారులు మరోసారి సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు.

సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారుల మధ్య చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకల విషయమై చర్చించారు.

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 22 వ తేదీ నుండి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షల సడలింపులో అంతరాష్ట్రాలకు రాకపోకలను పునరుద్దరించేందుకు అవకాశం కల్పించింది. 

అయితే ఈ ఏడాది మే 21వ తేదీ నుండి ఏపీ రాష్ట్రం నుండి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలకు బస్సు సర్వీసులను ప్రారంభించారు.కానీ, తెలంగాణకు మాత్రం ఏపీ నుండి బస్సుల రాకపోకలు మాత్రం అలాగే నిలిచిపోయాయి.

రెండు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలపై గతంలో విజయవాడలో రెండు రాష్ట్రాల మధ్య చర్చలు  ఈ ఏడాది జూన్ లో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇవాళ మరోసారి చర్చలు జరిగాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఏపీ బస్సులు 1.20 లక్షల కి.మీ బస్సులు తిరుగుతున్నాయని తెలంగాణ అధికారులు ఏపీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని కి.మీ దూరం తగ్గించుకోవాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. 

also read:తెలంగాణ ఆర్టీసీ కష్టాలు: ఉద్యోగుల జీతాలకు రూ. 600 కోట్ల లోన్ అమౌంట్ మళ్లింపు

అయితే ఇంటర్ స్టేట్ బస్సు సర్వీసుల రాకపోకలపై కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి చెబుతామని తెలంగాణ అధికారులు ప్రకటించారు.ఈ విషయమై మరోసారి భేటీ కావాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.  
 

click me!