6 గంటలు ఆసుపత్రుల చుట్టు తిరిగింది: ఇంట్లోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

By narsimha lodeFirst Published Aug 24, 2020, 5:13 PM IST
Highlights

ఆరు గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగి ఇంట్లోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.

ఖమ్మం: ఆరు గంటల పాటు ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు తిరిగి ఇంట్లోనే ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతను సాకుగా చూపితే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం డెలీవరీ కేసులను మాత్రం చేర్చుకోలేదు.

ఖమ్మం పట్టణంలోని రమణగుట్టలో రమేష్, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. లలిత భర్త రమేష్ ఖమ్మం రైల్వే స్టేషన్ లో పారిశుద్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లలిత కూడ అక్కడే పనిచేస్తోంది. లలిత నిండు గర్భవతి. రెండు నెలల క్రితం వరకు ఆమె విధులకు హాజరైంది. 

ఈ నెల 13వ తేదీన లలితకు పురుటి నొప్పులు వచ్చాయి. అయితే 108లో కుటుంబసభ్యులు లలితను జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అంబులెన్స్ ఆసుపత్రికి చేరుకోగానే వైద్యులు లేరని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పారు. నర్సులు మాత్రమే ఉన్నారని చెప్పడంతో చేసేదీలేక అంబులెన్స్ లో పట్టణంలోని నాలుగు ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు వెళ్లారు.

కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కూడ ఆమెను చేర్చుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమెను ఇంటికి చేర్చారు. ఇంట్లోనే లలితకు ఇరుగుపొరుగు మహిళలు పురుడు పోశారు.  పొరుగింటిలో ఉంటున్న మహిళ నర్సు కావడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకొంది. పండండి బిడ్డకు లలిత జన్మనిచ్చింది.
 

click me!