ఎపి డీజీపికి షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత

Published : Mar 05, 2019, 09:54 PM IST
ఎపి డీజీపికి షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత

సారాంశం

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్‌ ఆక్రమించిన పార్క్‌ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ  కూల్చివేసింది. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ వేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఠాకూర్‌ ఆక్రమించిన పార్క్‌ స్థలాన్ని జీహెచ్‌ఎంసీ  కూల్చివేసింది. 

హైదరాబాదులోని ప్రశాసన్‌ నగర్‌లో తన ఇంటికి ఆనుకొన్ని ఉన్న పార్క్‌ స్థలాన్ని ఆక్రమించడంతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి హైకోర్ట్‌లో పిటిషన్‌ వేశారు. 

ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. వెంటనే అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో జీహెచ్ఎంసి రంగంలోకి దిగి దాన్ని కూల్చేసింది.

PREV
click me!

Recommended Stories

Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు