రజినీకి ప్రభుత్వ ఉద్యోగం: సీఎంగా అనుముల రేవంత్ రెడ్డి తొలి సంతకం ఇదే

By narsimha lodeFirst Published Dec 6, 2023, 2:43 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డి  రజనీ అనే యువతికి  ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఫైలుపై సంతకం చేయనున్నారు. 


హైదరాబాద్: రజనీ అనే యువతికి ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ముఖ్యమంత్రిగా  రేవంత్ రెడ్డి  ఈ నెల  7వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసినట్టుగా  కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

రజనీ అనే యువతికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  రేవంత్ రెడ్డి ఆదేశించారు. దివ్యాంగురాలైన రజనికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.  సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  రజనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఫైలుపై సంతకం చేయనున్నారు. రేపు ఎల్ బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగ ప్రమాణం చేయగానే  ఇదే ఫైలుపై సంతకం చేస్తారు.ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిని రజని కలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన  తర్వాత  ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ హామీ మేరకు రజినికి ఉద్యోగం కల్పించాలని  రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 

Latest Videos

also read:Anumula Revanth Reddy:రేవంత్ రెడ్డిని రెండేళ్లకు ఏళ్లు మించి సీఎంగా ఉండనివ్వరా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.  ఈ దఫా అధికారంలోకి రావడం కోసం  కాాంగ్రెస్ పార్టీ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించింది. బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో  ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో  కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది.నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో  బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.అయితే  అధికారంలోకి వచ్చిన తర్వాత  ఈ నినాదాన్ని  వదిలేసిందని  కాంగ్రెస్ ఆరోపించింది. తెలంగాణలో అధికారంలోకి రావడంతో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని  కాంగ్రెస్ పార్టీ నేతలు  హామీలు ఇస్తున్నారు.

 

 

 

click me!