కిటికి నుండి తొంగి చూసిన చిరుత: రాజేంద్రనగర్‌ పరిసరాల్లో మరోసారి పులి సంచారం

By narsimha lodeFirst Published Jun 9, 2020, 12:09 PM IST
Highlights

హైద్రాబాద్ వాసులకు చిరుతపులి భయం ఇంకా తీరడం లేదు. రాజేంద్రనగర్ పరిసరాల్లో పులి సంచరించినట్టుగా సీసీటీవీ రికార్డుల్లో రికార్డైంది. ఓ ఇంటి కిటికీలోకి చిరుతపులి తొంగిచూసినట్టుగా సీసీటీవీ పుటేజీల్లో రికార్డయ్యాయి.

హైదరాబాద్: హైద్రాబాద్ వాసులకు చిరుతపులి భయం ఇంకా తీరడం లేదు. రాజేంద్రనగర్ పరిసరాల్లో పులి సంచరించినట్టుగా సీసీటీవీ రికార్డుల్లో రికార్డైంది. ఓ ఇంటి కిటికీలోకి చిరుతపులి తొంగిచూసినట్టుగా సీసీటీవీ పుటేజీల్లో రికార్డయ్యాయి.

ఈ ఏడాది మే 14వ తేదీన రాజేంద్రనగర్ కాటేదాన్ ప్రాంతంలో చిరుతపులి జాతీయ రహదారిపై ప్రత్యక్షమైంది. ఈ పులి వద్దకు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ పై పులి దాడి చేసి పారిపోయింది.

ఈ పులిని పట్టుకొనేందుకు అటవీశాఖాధికారులు రెండు రోజుల పాటు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఫలితం లేకపోయింది. చిరుతపులి కోసం మేకలను కూడ ఏర్పాటు చేశారు. కానీ చిరుతపులి తప్పించుకొని తిరిగింది.

మే 16వ తేదీన చిలుకూరు బాలాజీ ఆలయానికి సమీపంలో పులి కన్పించింది.  ఇక్కడ కూడ ఓ లారీ డ్రైవర్ పై దాడి చేసి పారిపోయింది. చిలుకూరు అడవుల్లోకి వెళ్లినట్టుగా పోలీసులు అటవీశాఖాధికారులు గుర్తించారు.

మే 19వ తేదీన హిమాయత్‌సాగర్ ఒడ్డున జీవీకే గార్డెన్స్ స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తాగుతుండగా వాచ్ మెన్ గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చాడు.అయితే ఆ రోజు కూడ పులి అడవిలోకి పారిపోయింది.

also read:హైదరాబాద్‌ను వీడని చిరుత టెన్షన్: రాజేంద్రనగర్ మళ్లీ కనిపించిన పులి

ఈ నెల 1వ తేదీన రాత్రి రాజేంద్రనగర్ సమీపంలో చిరుతపులి కన్పించింది.  వ్యవసాయ యూనివర్శిటీ ఆవరణలో పులి సంచరించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో 20 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ నెల 1వ తేదీ నుండి పులి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కానీ ఇంతవరకు కూడ ఆచూకీ అభ్యం కాలేదు.తాజాగా రాజేంద్రనగర్ నగర్ వ్యవసాయ యూనివర్శిటీ ప్రాంగంణంలో చిరుతపులి సంచరించినట్టుగా అధికారులు గుర్తించారు.

ఓ ఫాంహౌస్ వద్ద ఇంటి కాంపౌండ్ లోకి చిరుతపులి ప్రవేశించినట్టుగా సీసీటీవీ కెమెరాలు రికార్డు చేశాయి. ఓ ఇంటి కిటికి నుండి పులి తొంగిచూస్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి.ఈ పుటేజీ ఆధారంగా అధికారులు పులిని పట్టుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.


 

click me!