జూబ్లీహిల్స్ పబ్ లో మరో అత్యాచారఘటన.. పుట్టినరోజని పార్టీకి పిలిచి యువతిపై...

Published : Jun 17, 2022, 10:55 AM IST
జూబ్లీహిల్స్ పబ్ లో మరో అత్యాచారఘటన.. పుట్టినరోజని పార్టీకి పిలిచి యువతిపై...

సారాంశం

జూబ్లీహిల్స్ పబ్ లో మైనర్ పై అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన నెలలోపే ఇలాంటి మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. 

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ పబ్‌లో మైనర్ గ్యాంగ్ రేప్ ఘటన తరువాత.. అలాంటి దారుణాలు చాలానే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువతిపై అత్యాచర ఘటన కలకలం రేపింది. ఇది కూడా ఓ పబ్ లో పార్టీ తరువాత జరగడం గమనార్హం. ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న 28 ఏళ్ల మహిళ మీద ఆమె ఇంట్లోనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. 

వివరాల్లోకి వెడితే.. ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న 28యేళ్ల యువతిని ఆమె స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఆ రోజు అతని పుట్టినరోజు అని, పబ్ లో పార్టీ ఇస్తున్నానని చెప్పి ఓ పబ్ కి ఆహ్వానించాడు. దీంతో ఆమె ఆఫీసు తరువాత పబ్ కి వెళ్లింది. అక్కడ పార్టీ బాగానే జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ తలెత్తలేదు. ఆ తరువాత పబ్ పార్టీ అయిపోయాక.. రాత్రి 11.30 ప్రాంతంలో ఆమెను ప్రగతినగర్ లోని ఆమె ఇంటివద్ద దింపుతామని వారు చెప్పారు. దీనికి ఆమె అంగీకరించింది. 

ఆ తరువాత వారు ఆమెను కారులో ప్రగతినగర్ లోని ఆమె ఇంటి వద్ద దించారు. అయితే ఆమె.. వారిని లోపలికి రావాల్సిందిగా పిలిచింది. అలా ఇంట్లోకి వచ్చిన వారు అర్థరాత్రి దాటేవరకు సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఆ తరువాత తెల్లవారుజాము 4.30గంటల ప్రాంతంలో వారిద్దరూ వెళ్లిపోయారు. యువతి 5 గంటలకు నిద్రలోకి జారుకుంది. 

అయితే, తన మీద ఎవరో పడుకున్నట్టుగా అనిపించడం, ప్రైవేట్ భాగాల్లో తీవ్రమైన నొప్పితో ఒక్కసారిగా మెలుకువలోకి వచ్చింది. చూస్తే.. కాసేపటి క్రితం తన ఇంట్లోనుంచి వెళ్లిపోయిన స్నేహితుడు తన మీద అత్యాచారం చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆమెకు ఏమీ అర్తం కాలేదు. వెంటనే ఆమె ప్రతిఘటించడం మొదలు పెట్టింది. అయితే, అతను తన బలాన్నంతా ఉపయోగించి ఆమె మీద అత్యాచారం చేయడమే కాకుండా.. ‘నువ్వు నన్ను ఏమీ చేయలేవు’.. అంటూ బెదిరించాడు. 

అతని నుంచి ఎలాగే తప్పించుకున్న ఆ యువతి.. బాత్రూంలోకి పరిగెత్తి గడియపెట్టుకుతుంది. ఆ తరువాత రక్షించమంటూ కేకలు వేయడం ప్రారంభించింది. తన కొలిగ్స్ ను సహాయం కోసం అర్థిస్తూ కాల్స్ చేసింది. ఇది గమనించిన స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తరువాత బైటికి వచ్చిన ఆమె.. వెంటనే అక్కడ్నుంచి బయటపడి.. పోలీసులను ఆశ్రయించింది. 

బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఆమె స్నేహితుడిపై ఐపీసీ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు ముందు కూడా జూబ్లీహిల్స్ పబ్ లోనే వీరు పార్టీ చేసుకున్నారని పోలీసులు తెలిపారు. మైనర్ బాలికపై ఎస్వీయూలో సామూహిక అత్యాచార ఘటన జరిగిన నెలరోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర సంచలనంగా మారింది. 

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు)

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి CM రేవంత్ రెడ్డి బోనాలు | Secunderabad Ujjaini Mahankali Bonalu 2026
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం | First Darshan of Ujjaini Mahankali Temple | Bonalu 2026