జూబ్లీహిల్స్ పబ్ లో అర్థరాత్రి పార్టీ... గుజరాతీ యువతిపై స్నేహితుడి అత్యాచారం

By Arun Kumar P  |  First Published Jun 17, 2022, 10:04 AM IST

జూబ్లీహిల్స్ లో విదేశీ యువతిపై సామూహిక అత్యాచారం ఘటన మరువకముందే గుజరాత్ కు చెందిన యువతిపై స్నేహితుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. 


హైదరాబాద్: ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో పనిచేసే స్పేహితులంతా కలిసి ఓ పబ్ లో భర్త్ డే పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు బాగా ఎంజాయ్ చేసారు. అయితే బాగా ఆలస్యమవడంతో పార్టీలో పాల్గొన్న స్నేహితురాలిని ఇంటివద్ద దింపడానికి కొందరు యువకులు వెళ్లారు. ఇలా వెళ్లినవారిలో ఒకడు నీచానికి పాల్పడ్డాడు. యువతి గదిలోకి చొరబడి ఆమెపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే... గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు చెందిన యువతి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంది. ఇలా చదువుకోడానికి నగరానికి వచ్చిన యువతికి ఇక్కడే ఓ సాఫ్ట్ వేర్ కంపనీలో కంటెంట్ రైటర్ గా మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో చదువు పూర్తయినా ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లోనే వుంటోంది. కూకట్ పల్లి ప్రగతి నగర్ లో ఓ అపార్ట్ మెంట్ లో ప్లాట్ అద్దెకు తీసుకుని వుంటోంది ఈ గుజరాతీ యువతి. 

Latest Videos

undefined

అయితే ఈ నెల 13వ తేదీ (సోమవారం) స్నేహితురాలి పుట్టినరోజు వుండటంతో జూబ్లీహిల్స్ లోని రిపీట్ పబ్ లో పార్టీ చేసుకున్నారు. అర్థరాత్రి వరకు పబ్ లోనే అంతా ఎంజాయ్ చేసారు. బాగా ఆలస్యం కావడంతో గుజరాతీ యువతిని ఇంటివద్ద దింపడానికి కొందరు స్నేహితులు వెళ్లారు. ఇలా దింపడానికి వెళ్లిన స్నేహితులు రాత్రంతా ఆమె ప్లాట్ లోనే కబుర్లు చెప్పుకుంటూ గడిపారు. తెల్లవారుజామును ఐదుగంటల వరకు ఇలా అందరూ మేలుకునే వున్నారు. 

తెల్లవారాక కొందరు స్నేహితులు వెళ్లిపోగా మరికొందరు అక్కడే వున్నారు. యువతి తన గదిలోకి వెళ్ళి పడుకోగా స్నేహితులు హాల్లో పడుకున్నారు. ఇలా యువతి ప్లాట్ లో వుండిపోయిన ఒకడు దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా పడుకున్న యువతి గదిలోకి చొరబడ్డ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి ప్రతిఘటించడంతో ఆమె మెడ, ఛాతీ బాగంలో గాయాలయ్యాయి. 

అత్యాచారం అనంతరం  యువకుడు అక్కడినుండి పరారయ్యాడు. దీంతో యువతి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన యువతి స్నేహితున్ని అరెస్ట్ చేసారు.   

గత నెల మే 28న జూబ్లీహిల్స్ లోని ఆమ్నేసినా పబ్ లో  గెట్ టూ గెదర్ పార్టీకి హాజరైన విదేశీ మైనర్ బాలికపై అత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా బాలికపై అత్యాచారానికి పాల్పడినవారిలో రాజకీయ నాయకుల పిల్లలు వుండటంతో ఈ ఘటనపై రాజకీయంగా దుమారం రేపింది. 

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది. ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంలో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసామని మంత్రి అన్నారు.

click me!