వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుండి నో ర్యాంక్ - నో పెన్షన్ అంటూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ : అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కు వ్యతిరేకంగా మీద దేశవ్యాప్తంగా చెలరేగుతులున్న నిరసనలు, హింసాత్మక ఘటనల మీద తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్పందించారు. ఈ నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయన్నారు. నిరుద్యుగం ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటనలు తెలుపుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం మొదట రైతులతో ఆటలాడుకుందని.. ఇప్పుడు సైనికులతో ఆడుకుంటోందని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుండి ప్రతిపాదిత నో ర్యాంక్ - నో పెన్షన్ వరకు.. నిరుద్యోగులను.. సైనికులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
undefined
The violent protests against is an eye-opener & acute indicator of the magnitude of unemployment crisis in the country
Pehle Desh ke Kisan Ke Saath खिलवाड़ Aur Ab Desh ke Jawan Ke Saath खिलवाड़
From One Rank - One Pension to proposed No Rank - No Pension!
ఇదిలా ఉండగా, కొత్త మిలటరీ రిక్రూట్‌మెంట్ పాలసీ అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో ఈ ఉదయం ఒక గుంపు రైల్వేస్టేషన్ మీద దాడికి దిగింది. రైల్వే స్టేషన్ లోని షాపులను, రైళ్లను కర్రలతో ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టడానికి రంగంలోకి దిగేసమయానికే చాలా మేరకు రైల్వే స్టేషన్ ఆస్తులను ఈ నిరసనకారులు ధ్వంసం చేశారు.
దీనికి సంబంధించిన కొన్ని అంశాలు ఇవి...
- వారితో మాట్లాడిన తర్వాత గుంపును చెదరగొట్టగలిగామని బల్లియా పోలీసులు చెప్పారు.
- తూర్పు యుపి జిల్లాలోని రైల్వే స్టేషన్ వెలుపల వీధుల్లో కర్రలు చేతపట్టుకున్న మరో వర్గం నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
- నిరసన వీడియోల్లో రైల్వే స్టేషన్‌లోని దుకాణాలు, బెంచీలను యువకులు దుడ్డుకర్రలతో బద్దలు కొట్టినట్టు చూపిస్తున్నాయి.
- "పోలీసులు సరైన సమయంలో రంగంలోకి దిగి... పెద్ద ఎత్తున నష్టం జరగకుండా ఆపగలిగారు. ఈ ఘటనలో పాల్గొన్నవారందరిమీద చర్య తీసుకుంటాము," అని బల్లియా జిల్లా మేజిస్ట్రేట్ సౌమ్య అగర్వాల్ విలేకరులతో అన్నారు.
- ఈ నిరసనలో పాల్గొన్న వారిని గుర్తించేందుకు ఈ వీడియోలను పరిశీలిస్తున్నామని బల్లియా పోలీస్ చీఫ్ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు. "వారిని కనిపెట్టిన తరువాత సరైన చర్యలు తీసుకుంటాం" అని నయ్యర్ చెప్పారు.
- బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సైన్యం ఆశావహులు రైలు, రోడ్డు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన మరుసటి రోజే.. ఈ ఉదయం ఈ నిరసన జరిగింది. ఈ నిరసన హర్యానా, యూపీలకు కూడా వ్యాపించింది.
- హర్యానాలోని పల్వాల్ జిల్లాలో నిరసనకారుల రాళ్ల దాడి, హింసాకాండతో ఫోన్ ఇంటర్నెట్, SMS సౌకర్యాలు 24 గంటలపాటు నిలిపివేయబడ్డాయి.
- గ్రాట్యుటీ, పెన్షన్ ప్రయోజనాలు లేకుండా చాలా మందికి నిర్బంధ పదవీ విరమణతో పాటు నాలుగు సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్‌పై జవాన్ల నియామకాన్ని అగ్నిపథ్ ప్రతిపాదిస్తుంది. కొత్త ప్రణాళికలో ప్రభుత్వం.. భారీ జీతం ఇంకా పెన్షన్ బిల్లులను తగ్గించడం.. ఆయుధాలు కొనుగోలు చేయడానికి నిధులను విడుదల చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
- నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం అగ్నిపత్ రిక్రూట్‌మెంట్ వయోపరిమితిని 21 నుంచి 23కి పెంచింది.
- ప్రభుత్వం ఈ పథకం 10-పాయింట్ డిఫెన్స్‌ను కూడా పేర్కొంది. రిక్రూట్‌లు నాలుగు సంవత్సరాల పాటు సైన్యంలో తమ కాంట్రాక్ట్ ను పూర్తి చేసిన తర్వాత.. వారికి ఇది నచ్చుతుందని..లోటుగా అనిపించదని హామీ ఇచ్చారు.