చాదర్‌ఘాట్‌లో మరో దారుణ హత్య.. హైదరాబాద్‌లో 15 గంటల వ్యవధిలో మొత్తం 5 హత్యలు..!!

Published : Jun 21, 2023, 05:05 PM IST
 చాదర్‌ఘాట్‌లో మరో దారుణ హత్య..  హైదరాబాద్‌లో 15 గంటల వ్యవధిలో మొత్తం 5 హత్యలు..!!

సారాంశం

హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న నేర ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నారు. 15 గంటల వ్యవధిలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు  హత్యకు గురయ్యారు.

హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న నేర ఘటనలు భయాందోళనకు గురిచేస్తున్నారు. 15 గంటల వ్యవధిలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు  హత్యకు గురయ్యారు. దీంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టప్పాఛబుత్రలో ఇద్దరు ట్రాన్స్జెండర్లను గుర్తుతెలియని వ్యక్తులు దారణంగా హత్య చేశారు. మైలార్దేవ్పల్లిలో దుండగులు ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఇద్దరిని బండరాళ్లతో కొట్టి దుండగులు చంపారు. తాజాగా చాదర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌లో పరిధిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అజంపురాలో దుండగులు గుర్తుతెలియని వ్యక్తిని హతమార్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయినట్టుగా తెలుస్తోంది. ఇక, వరుస హత్యలతో నగరంలోని జనాలు ఉలిక్కిపడుతున్నారు. 

టప్పాఛబుత్ర ఘటన..
టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు ట్రాన్స్‌జెండర్లపై తెల్లవారుజామున ఒంటి గంట  సమయంలో దుండగులు దాడి చేశారు. వారిపై కనికరం లేకుండా రాళ్లతో దాడి చేసి కత్తితో పొడిచారు. ఫలితంగా వారు అక్కడికక్కడే మరణించారు. ‘‘మరణించిన వ్యక్తులు ఇద్దరూ ట్రాన్స్‌జెండర్లు. వారి వయసు 25- 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది’’ అని ఒక పోలీసు అధికారి తెలిపారు. లింగమార్పిడి బాధితులతో నేరస్తులకు సన్నిహిత సంబంధాలు ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు ప్రస్తుతం నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. కత్తిపోట్లకు ఉపయోగించిన కత్తిని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. 

మైలార్‌దేవ్‌పల్లిలో.. 
ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్న ఇద్దరు నిరాశ్రయులైన వ్యక్తులన బుధవారం ఉదయం మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వేర్వేరు ప్రదేశాలలో రోడ్డు పక్కన నిద్రిస్తుండగా గుర్తుతెలియని దుండగులు దారుణంగా దాడి చేసి, హత్య చేశారు. మరణించిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. టప్పాచబుత్రాలో  చోటుచేసుకున్న ఘటనతో దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu