హైదరాబాద్‌లో నాళాకు మరొకరు బలి: మూడు రోజుల క్రితం గల్లంతు.. ఆలస్యంగా వెలుగులోకి

Siva Kodati |  
Published : Sep 29, 2021, 08:33 PM IST
హైదరాబాద్‌లో నాళాకు మరొకరు బలి: మూడు రోజుల క్రితం గల్లంతు.. ఆలస్యంగా వెలుగులోకి

సారాంశం

మణికొండలో రజనీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాళాలో గల్లంతై చెరువులో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో విషాదమైంది. తాజాగా బుధవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడు

మణికొండలో రజనీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాళాలో గల్లంతై చెరువులో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో విషాదమైంది. తాజాగా బుధవారం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడు. ఈ నెల 25న జరిగిన ప్రమాదం విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కుత్భుల్లాపూర్‌లోని గణేశ్ టవర్స్‌లో నివసిస్తున్న మోహన్ అనే వ్యక్తి 25 రాత్రి స్థానిక రాయల్ వైన్స్ వద్ద స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. ఇంటికి బయల్దేరే సమయంలో భారీ వర్షం కురవడంతో స్నేహితులు ఇద్దరూ పక్కనే ఆగారు. మోహన్ రెడ్డి పక్కకు వెళ్లి సిగరేట్ తాగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ నాళాలో పడిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ నాళాలో కొట్టుకుపోయాడు.

Also Read:హైద్రాబాద్ మణికొండ డ్రైనేజీలో రజనీకాంత్ గల్లంతు: నెక్నామ్ చెరువులో డెడ్‌బాడీ లభ్యం

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?